మణిరత్నం మల్టీస్టారర్ లో మరో ప్రముఖ నటుడు

0
533

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ లో ఒకరైన మణిరత్నం నవాబ్ సినిమా తరువాత చేస్తోన్న మరో మల్లీస్టారర్ పొన్నియన్ సెల్వన్. ఈ బిగ్ బడ్జెట్ మూవీలో తారాగణం అన్ని వర్గాల సినీ పరిశ్రమలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే విక్రమ్ – జయం రవి – కార్తీ వంటి ప్రముఖ హీరోలు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఐశ్వర్యా రాయ్ – మోహన్ బాబు – కీర్తి సురేష్ – అమలా పాల్ – ఆది వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఇప్పుడు వారితో పాటు మలయాళం సీనియర్ యాక్టర్ జయరామ్ కూడా పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించనున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిరత్నం గారు ఒక పాత్ర చేయమని కోరగానే వెంటనే ఒప్పుకున్నట్లు చెప్పారు. అయితే జయరామ్ ఏ పాత్రలో నటిస్తున్నారన్న విషయాన్నీ మాత్రం బయటపెట్టలేదు. గత ఏడాది వచ్చిన అనుష్క భాగమతి సినిమాలో జయరామ్ విలన్ గా కనిపించి ప్రశంసలు అందుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here