యంగ్ హీరో ఆది సాయికుమార్ ఈ సారి ఒక మంచి యూత్ ఫుల్, లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘జోడి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ ఆదికి జోడీగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు వీక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. గతంలో ‘‘వాన, మస్కా, సినిమా చూపిస్త మామ’’ చిత్రాలకు విశ్వనాథ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఇప్పుడు ‘జోడి’ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక తమ సినిమాను సెప్టెంబర్ 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది . అతి త్వరలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు పూర్తి సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ కానున్నాయి. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతీరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భావనా క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గుర్రం సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం సినిమాని నిర్మిస్తున్నారు. ‘నీవే’ ఫేమ్ ఫణి కళ్యాణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, ఎస్.వి.విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ అందించారు…..!!


