వెంకటేష్, రాశి ఖన్నా ల ‘వెంకీ మామ’ లేటెస్ట్ క్లిక్…!!

0
395
Venkatesh Rashi Khanna On Teh Sets Of Venky Mama

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలయికలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మల్టి స్టారర్ మూవీ వెంకీ మామ. నిజజీవితంలో మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగచైతన్యలు ఈ సినిమాలో కూడా అవే పాత్రల్లో నటిస్తున్నారు. యువ దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మూవీ టైటిల్‌ లోగోను ఉగాది పండుగ నాడు విడుదల చేసింది చిత్రయూనిట్‌. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పలు షెడ్యూల్స్ సక్సెఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఆకట్టుకునే కథ, కథనాలతో ఒక హృద్యమైన కథను, మంచి ఎంటర్టైన్మెంట్ తో దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమాలో వెంకీ, చైతు కలిసి ఉన్న ఒక ఫొటోతో కూడిన మోషన్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమాలో వెంకటేష్, రాశి ఖన్నా కలిసి సెట్ లో దిగిన ఫోటో ఒకటి, నేడు పలు మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here