సుల్తాన్ తో పహిల్వాన్ పట్టు

0
220
Sudeep Salman Khan

స్టార్ హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. అయితే చేతిలో చెయ్యేసుకొని, హగ్ చేసుకొని స్టిల్ ఇవ్వడం రొటీన్ అనుకున్నారో ఏమో గాని సల్మాన్ ఖాన్ – కిచ్చా సుదీప్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కి స్ట్రాంగ్ కిక్కిస్తోంది. ఒకరు బాలీవుడ్ లో స్టార్ హీరో అయితే మరొకరు శాండిల్ వుడ్ స్టార్ ఇలా ఇద్దరు ఇండస్ట్రీల హీరోలు కుస్తీ పడుతూ కనిపించారు.

గతంలో కుస్తీ బ్యాక్ డ్రాప్ లో సల్మాన్ సుల్తాన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో సుదీప్ పహిల్వాన్ సినిమా చేసి రిలీజ్ చేయడానికి రెడీ ఉంచాడు. ఇద్దరు ఒకే జానర్ లో సినిమా చేయడంతో ఈ విధంగా స్టిల్ ఇచ్చారని చెప్పవచ్చు. అలాగే సుదీప్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 లో విలన్ గా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here