ఆకట్టుకుంటున్న ధనుష్ ‘అసురన్’ లేటెస్ట్ పోస్టర్స్….!!

0
682

గత ఏడాది తమిళ్ లో వచ్చిన వడ చెన్నై, మారి 2 సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అసురన్. ఆకట్టుకునే కథ, కథనాలతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, ఆయన ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఈ సినిమాలోని ధనుష్ లుక్ కు సంబంధించి రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఓల్డ్ స్టైల్ లో హాఫ్ హాండ్స్ చెక్స్ షర్ట్ వేసుకుని కూల్ గా ఉన్న పోస్టర్ ఒకటి అయితే, అదే విధమైన డ్రెస్ తో కత్తి పట్టుకుని ఆవేశంతో చూస్తున్న మరొక పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కలై పులి ఎస్ థాను సమర్పణలో, వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ తొలిసారి తమిళ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇంకా టీజె అరుణసలం, బాలాజి శక్తివేల్, ప్రకాష్ రాజ్, పశుపతి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, వేల్రాజ్ సినిమాటోగ్రఫీని, జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here