బిగ్ బి అమితాబ్ బచ్చన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అభిమానులకు చాలా దగ్గరయ్యారనే చెప్పాలి. బుల్లితెరపై కౌన్ బనేగా క్రౌర్ పతి షోతో ఎంతగా పాపులర్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత 19 ఏళ్ల నుంచి 10 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్ బి ఇప్పుడు 11వ సీజన్ తో రెడీ అయ్యాడు. ఓ వైపు నటుడిగా బిజీ అవుతూనే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
సోమవారం కేబీసీ 11వ సిజన్ సోని టీవీ లో ప్రసారం కానుంది. సామాన్యులను హాట్ సీట్ లోకి రప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపే ఈ షో భారతదేశ ప్రముఖ భాషల్లో చాలా వరకు క్లిక్కయ్యింది. ఇక షోకి సంబందించిన ఒక వీడియోను అమితాబ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఎన్నో జ్ఞాపకాలతో నిండిన కేబీసీ మరో అడుగు వేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈ సీజన్ లో ఎంతమంది సామాన్యుల జీవితాల్ని ఈ షో మారుస్తుందో చూడాలి.


