నాచురల్ స్టార్ నాని హీరోగా, వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్, ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టాయి. ఈ సినిమాలో ‘హొయినా హొయినా’ అనే పల్లవితో సాగె రెండవ లిరికల్ సాంగ్ ను, మొన్న ఆగష్టు 15న హీరో నాని, సంగీత దర్శకుడు అనిరుద్ కలిసి వినూత్నంగా ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసారు.
ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ నేడు 1 మిలియన్ వ్యూస్, 50 వేల లైక్స్ సాధించి యూట్యూబ్ లో దూసుకెళుతోంది. అనిరుద్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ ను ప్రముఖ సింగర్ ఇన్నో గెంగా ఎంతో అద్భుతంగా ఆలపించారు. అలానే అనంత్ శ్రీరామ్ తో కలిసి, గెంగా కూడా ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. మేల్ సోలోగా మంచి మెలోడియస్ గా, ఆకట్టుకునే వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ తో సాగిన ఈ సాంగ్, యూత్ ను విశేషంగా ఆకట్టుకుంతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


