ప్రభాస్ – శ్రద్ధగా కపూర్ జంటగా నటించిన సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేందుకు చిత్ర యూనిట్ 60 అడుగుల ప్రభాస్ కటౌట్ ని ఏర్పాటు చేశారు. అభిమానులు ఆ కటౌట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ట్రైలర్ లో అందరిని ఎక్కువ ఎట్రాక్ట్ చేసిన స్టిల్ కూడా ఇదే. బ్లాక్ డ్రెస్ లో ప్రభాస్ యాక్షన్ మోడ్ ని ఆన్ చేసినట్లుగా ఉంది. అలాగే కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. అని మిర్చి సినిమా డైలాగ్ కూడా గుర్తు రాక మానదు. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా సాహో సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు.


