కొత్త ఆర్టిస్టులకు శర్వా ఒక ఇన్స్పిరేషన్..రణరంగం తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది – హీరో నితిన్

0
946

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో, పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ విడుదల చేసిన ‘రణరంగం’ సౌండ్‌ కట్‌ ట్రైలర్‌కు విశేష ప్రాచుర్యం లభించింది ఆగస్టు 15 సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో నితిన్ ముఖ్య అతిధిగా హాజరై రణరంగం ఆడియో సిడి లను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ – ” నేను ఒక వెబ్ కంటెంట్ కి పని చేస్తుంటే శర్వా చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో కన్ను కొట్టి, కుమ్మెయిరా రెండు సాంగ్స్ చేశాను. సెవెన్ ఇయర్స్ బ్యాక్ సుధీర్ వర్మ గారిని కలిసాను. ఇప్పుడు ఆయనతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది” అన్నారు.

సినిమాటోగ్రాఫర్ దివాకర్ మాట్లాడుతూ – ” ఈ సినిమాలో కొత్త గా ట్రై చేశాం. దానికి మీ రెస్పాన్స్ చాలా బాగుంది. సుధీర్ వర్మ, శర్వా, వంశీ గారికి థాంక్స్. రణరంగం సినిమా కొత్తగా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ – “స్వామి రారా సినిమా నుండి నాకు సుధీర్ వర్మ గారు అంటే చాలా ఇష్టం. ట్రైలర్ లో 1990 కి సంభందించిన కొన్ని విజువల్స్ చూశాను. పేరుకే 90 కానీ చాలా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ బాగా నచ్చింది. శర్వా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇదే ప్రొడక్షన్ లో నా నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. నా ఓన్ ప్రొడక్షన్ లాంటిది. ఈ సినిమా ద్వారా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అల్ ద బెస్ట్” అన్నారు.

హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని మాట్లాడుతూ – ” ఈ సినిమా అంత శర్వా క్యారెక్టర్ మీదే ఉన్న ఆ క్యారెక్టర్ యొక్క ఇంటెన్సిటీ తీసుకునే క్యారెక్టర్ ని నాకు ఇచ్చిన సుధీర్ వర్మ గారికి థాంక్స్. ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. అలాగే మా ప్రొడ్యూసర్స్ కి స్పెషల్ థాంక్స్. నాకు ఈ సినిమాలో కాజల్ తో కలిసి నటించే అవకాశం రాలేదు. కానీ ఆమె మంచి పెర్ఫార్మర్. శర్వా ట్రూలీ ఇన్స్పిరేషనల్. ఆగష్టు 15 రణరంగం లో కలుద్దాం” అన్నారు.

చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ – ” ముందుగా ఈ సినిమాకు వర్క్ చేసిన టెక్నిషియన్స్ అందరికీథాంక్స్. ముఖ్యంగా దివాకర్ గారు. ట్రైలర్ లో మీరు చూసిన విజువల్స్ అన్ని అతనే క్రియేట్ చేశాడు. ఆ క్రెడిట్ అంతా అతనిదే. అలాగే ప్రశాంత్ బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. వంశీ చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్. ఇంత వరకూ సినిమాకు ఎంత అయిందో కూడా చెప్పలేదు. అలాగే హీరోయిన్ కాజల్, కళ్యాణి డీసెంట్ జాబ్ చేశారు. సినిమా అంతాశర్వా జర్నీ ఉంటుంది. రెండు క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చేశాడు. ఆగష్టు 15 న థియేటర్స్ లో కలుద్దాం” అన్నారు.

హీరో నితిన్ మాట్లాడుతూ – ” ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో45 ఇయర్స్ మ్యాన్ గా ఎలా కనిపిస్తాడు అనుకున్న కానీ పోస్టర్స్ , ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వా ఈ స్థానంలో ఉండడం నిజంగా గొప్ప విషయం ఇండస్ట్రీ కి వచ్చే చాలా మంది కొత్త ఆర్టిస్టులకు శర్వా ఒక ఇన్స్పిరేషన్. క్యారెక్టర్ ఆరిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇంతవరకూవచ్చారు. ఎలాంటి సపోర్ట్ లేకున్నా తనకంటూ సపరేట్ మార్కెట్, సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు.డిఫరెంట్ గా ఉండే సినిమాలే చేస్తాడు. ఎక్స్ట్రార్డినరీ ఆర్టిస్ట్. . సుధీర్ వర్మ ఒక వండర్ఫుల్ టెక్నిషియన్. కరెక్ట్ కథ పడితే మనోడు ఎక్కడో ఉంటాడు. ఈ సినిమాతో అది నిజం అవుతుందని అనుకుంటున్నాను. టీం అందరికి ఆగష్టు 15 ఒక స్పెషల్ డే గా నిలిచిపోతుంది.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ – “సినిమా చాలా బాగా వచ్చింది. టీమ్ అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్, వంశీ ఫ్యామిలీ సినిమా చూశారు. వాళ్ళ దగ్గరనుండి మంచి రిపోర్ట్ వచ్చింది. ఈ సినిమా చూసి వంశీ నాకు ఫోన్ చేసి నేను మంచి సినిమా తీశాను అని గర్వంగా ఉంది అన్నారు ఒక హీరో కి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మంచి సినిమా తీశాం అని చెప్పడం కంటే సంతోషం మరొకటి ఉండదు. అలాగే ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్ కి థాంక్స్. కళ్యాణి ప్రియదర్శన్ చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్. అంత పెద్ద డైరెక్టర్ కూతురు అయినా ఏ మాత్రం యాటిట్యూడ్ ఉండదు. సుధీర్ మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్. ఇదే బ్యానేర్ లో తనతో మరో సినిమా చేయాలనీ ఉంది. సినిమా మీ అందరికీ నచ్చుతుంది. సినిమా విడుదలయ్యాక మిగతా విషయాలు మాట్లాడతాను” అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత: సూర్యదేవర నాగవంశీ ,రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

Ranarangam Pre Release Press Meet – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here