బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమా ప్రారంభం

0
588

కేరింత, మనమంతా ఫేమ్ విశ్వంత్ హీరోగా BFH (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రారంభం అయింది.  నిర్మాత యశ్ రంగినేని, హీరో విజయ్ దేవరకొండ నాన్న గోవర్ధన్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చారు.

‘BFH’లో మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివాజీ రాజా, రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ కంభంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.  గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. స్వస్తిక సినిమా బ్యానర్‌లో వేణు మాధవ్ పెద్ది నిర్మిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here