ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా సైమా అవార్డుల ఫంక్షన్ ని ఎంతో వేడుకగా జరపాలని నిర్ణయించారు నిర్వాహకులు. ఇక అతి త్వరలో జరిగే ఈ సైమా 2019 అవార్డుల ఫంక్షన్, ఖతార్ లో సినిమా ప్రముఖులు మరియు అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగనుంది. ఈ వేడుకకు పద్మ భూషణ్ అవార్డు గ్రహీతలైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మోలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నట్లు సైమా టీమ్ వారు అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
అయితే ఆగష్టు 15వ తేదీన జరిగే తెలుగు మరియు కన్నడ సినిమాల అవార్డుల వేడుకకు మెగాస్టార్, అలానే ఆగష్టు 16 వ తేదీన జరిగే తమిళ మరియు మలయాళ సినిమా అవార్డుల వేడుకకు మోహన్ లాల్, చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. ఈ ఏడాది కూడా పలు విజయవంతమైన సినిమాలు అవార్డుల లిస్టులో ఉండడంతో, ఏ ఏ క్యాటగిరిలో ఎవరెవరికి అవార్డులు దక్కుతాయో తెలుసుకోవాలని ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూతున్నారు. ఇక ఈ వేడుకకు చిరంజీవి, మోహన్ లాల్ కూడా హాజరవుతూ ఉండడంతో ఈ వేడుక మరింత కన్నుల పండుగగా జరుగనుంది….!!


