రొమాంటిక్, ఫన్, ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకుంటున్న మన్మధుడు 2 ట్రైలర్…..!!

0
191

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా, బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ మన్మధుడు-2. ఈ సినిమాకు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక సాంగ్ మరియు టీజర్లు ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై మంచి క్రేజ్ ని సంపాదించాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.

ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే ఫన్నీ, రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలతో అద్భుతంగా సాగింది. ‘అద్భుతం, అమోఘం, ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు’ అంటూ నాగార్జున పలికే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘ఒకపూట భోజనం కోసం వ్యవసాయం చేయను’, ‘నేను పిల్లల్ని కనను, నా జీవితం మాత్రమే నా బాధ్యత’ అంటూ ట్రైలర్ లో నాగ్ పలికే డైలాగులు, సినిమాలో అయన పాత్రను పరిచయం చేస్తాయి. ఇక ‘మీ కృష్ణావతారం అయిపోయింది, ఇంక రామావతారం స్టార్ట్ అన్నమాట’ అంటూ కమెడియన్ వెన్నెల కిషోర్ ట్రైలర్ ఎండింగ్ లో పలికె డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here