మిస్టర్ కెకె లో అతిర క్యారెక్టర్ ని ఛాలెంజింగ్‌గా తీసుకొని నటించాను – హీరోయిన్‌ అక్షరహాసన్‌

0
1057

చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై రూపోందిన ‘కడరమ్‌ కొండాన్‌’ చిత్రాన్ని తెలుగులో  మిస్టర్ కె కె పేరుతో నిర్మాతలు టి.నరేష్‌ కుమార్‌, టి. శ్రీధర్‌లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణలో నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెషన్స్‌ బ్యానర్‌పై జూలై 19న గ్రాండ్‌గావిడుదల చేస్తున్నారు.ఈసందర్భంగా హీరోయిన్‌ అక్షరహాసన్‌ ఇంటర్వ్యూ..

విక్రమ్‌తో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌?
– విక్రమ్‌సర్‌తో కలిసి నటించడం చాలా అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇంకా చాలా ఎగ్జిటింగ్‌గా కూడా అనిపించింది ఎందుకంటే నేను నటించాలనుకునే వారిలో విక్రమ్‌సర్‌ ముందుంటారు. అలాగే ఈ సినిమా ద్వారా అతని పెర్ఫామెన్స్‌ని ముందే చూడగలిగాను. విక్రమ్‌సర్‌ ఒక రియల్‌ హీరో. అతని పెర్ఫామెన్స్‌ని ఏ ఇతర యాక్టర్స్‌తో పోల్చలేము. వన్‌ ఆఫ్‌ వర్సటైల్‌ ఆర్టిస్ట్‌. నటన పరంగా నాకు చాలా హెల్ప్‌ చేశారు.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి?
– ‘మిస్టర్‌ కె కె’ సినిమాలో నా క్యారెక్టర్‌ గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేను కానీ.. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు అతిరః. అభి హాసన్‌కి వైఫ్‌గా ఒక ప్రెగ్నెంట్‌ విమెన్‌గా కనిపిస్తాను. ఇంతకు మించి నా క్యారెక్టర్‌ గురించి ఏం చెప్పిన అది ఈ సినిమాను స్పాయిల్‌ చేస్తుంది కాబట్టి జులై 19న మీరే థియేటర్‌లో చూసి తెలుసుకోండి.

ఈ సినిమాకు మీ నాన్న గారే ప్రొడ్యూసర్‌ కదా! రెమ్యూనరేషన్‌ తీసుకున్నారా?
– ఎందుకు తీసుకోను.. వర్క్‌ ఈజ్‌ వర్క్‌ ( నవ్వుతూ).

మీ బ్యానేర్‌లో వర్క్‌ చేయడం ఎలా అనిపిస్తోంది?
– అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎందుకంటే ఆ బ్యానేర్‌ చాలా లెజెండరీ మూవీస్‌ని నిర్మించింది. ఆ బ్యానేర్‌లో వచ్చిన చాలా సినిమాలు ఇప్పటికి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్‌లా ఉంటాయి. ఆ బ్యానేర్‌లో నేను నటించబోతున్నాను అని తెలియగానే నాకు గూస్‌బమ్స్‌ వచ్చాయి. అంత ప్రస్టేజియస్‌ బ్యానేర్‌లో నటించడం నిజంగా ఐ యామ్‌ బ్లెస్‌డ్‌.

ఈ క్యారెక్టర్‌ కోసం ఎవరి సలహాలైనా తీసుకున్నారా?
– మా అమ్మ గారి నుండి కొన్ని సలహాలు తీసుకున్నాను. కథ పరంగా ప్రగ్నెంట్‌ విమెన్‌ కాబట్టి అమ్మ ముందు నటించి చూపించే దానిని. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్‌ దగ్గరనుండి సలహాలు తీసుకునేదానిని. ఈ క్యారెక్టర్‌ని అర్ధం చేసుకోవాలని ఎక్కువ సమయం తీసుకున్నాను. అలాగే ఛాలెంజింగ్‌ గా తీసుకొని నటించాను.

మీ కెరీర్‌ స్టార్టింగ్‌ లోనే అమితాబ్‌ బచ్చన్‌తో నటించారు కదా! ఎలా అనిపించింది?
– అబితాబ్‌ సర్‌తో కలిసి యాక్ట్‌ చెయడం కొన్ని సందర్భాలలో ఈజి, కొన్ని సందర్భాలలో కష్టం అనిపించేది. బచ్చన్‌ సర్‌ నన్ను చాలా కంఫర్టబుల్‌గా చూసుకునే వారు. నటనలో కావాల్సిన శిక్షణ ఇచ్చి ఎంకరేజ్‌ చేసే వారు. అలాగే ధనుష్‌, పీసీ సర్‌ కూడా నన్ను చాలా కంఫర్ట్‌ ఉంచేవారు. అందుకని సులభంగా అనిపించేది. ఐతే అంత లెజెండరీ యాక్టర్‌తో కలిసి పని చేస్తున్నాను కాబట్టి కొంత నెర్వస్‌ అయ్యే దాన్ని. అది కొంచెం కష్టంగా అనిపించేది.

డైరెక్టర్‌ రాజేష్‌ మేకింగ్‌ గురించి?
– రాజేష్‌ చాలా తన వర్క్‌ పట్ల చాలా క్లియర్‌గా ఉండే వారు. నాకు ఏదయినా సీన్‌ అర్ధం కాకపొతే చాలా ఓపికగా చెప్పేవారు. అలాగే టెక్నికల్‌గా చాలా అడ్వాన్సుడ్‌గా ఉండే వారు. ఆర్టిస్ట్‌లకు కంఫర్ట్‌ ఇస్తూనే వారి నుండి బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ రాబట్టుకునే వారు.

ఈ సినిమాకు తెలుగులో మీరే డబ్బింగ్‌ చెప్పారా?
– లేదండి! నేను తమిళ్‌లో చెప్పాను, కానీ తెలుగులో నేను అంత ఫెమిలియర్‌ కాదు అందుకే చెప్పలేదు.. కానీ త్వరలోనే చెప్తాను.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– కొన్ని స్క్రిప్ట్‌ లు విన్నాను కానీ ఇంకా ఏది ఫైనలైజ్‌ చేయలేదు. త్వరలోనే నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తాను.

యాక్టింగ్‌ కాకుండా ఇతర రంగాలలో ఇంట్రెస్ట్‌ ఉందా?
– ఇంట్రెస్ట్‌ అయితే ఉంది. కానీ దర్శకత్వం మాత్రం చేయాలనుకోవడం లేదు. నా దగ్గర రెండుమూడు ఇంకా ఫినిష్‌ కానీ స్క్రిప్ట్‌లు ఉన్నాయి. త్వరలోనే వాటిని ఫినిష్‌ చేస్తాను. ఇంకా కొన్ని ఐడియాస్‌ ఉన్నాయి కానీ వాటికి మా నాన్న గారి అనుమతి కావాలి. ఆయన అనుమతి వచ్చాక మిగతా విషయాలు మీకు తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్‌ అక్షర హాసన్‌.

Akshara Haasan – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here