టాలీవుడ్ లో అలరించే శ్రావ్యమైన సంగీతంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. దేవి సంగీతంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆయన సోదరుడు, ప్రముఖ గాయకుడు అయిన సాగర్ వివాహం గత నెల 19న తమ కుటుంబసభ్యులు మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిగినట్లు దేవి కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది.
తన సోదరుడికి భార్యగా మౌనిక గారిని తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఈ నూతన జంటకు మీ అందరి ఆశీస్సులు, ప్రేమ కావాలని అభిమానులను కోరుతూ అయన ఈ పోస్ట్ ను పెట్టడం జరిగింది. అంతేకాక తన సోదరుడి వివాహమైన అదే రోజు, తమ తల్లితండ్రుల వివాహమహోత్సవ దినం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తూ దేవి పోస్ట్ చేసారు. ప్రస్తుతం దేవి చేసిన ఆ పోస్ట్ వైరల్ గా మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతోంది….!!


