సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన “దొరసాని”….!!

0
54

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రముఖ నటులు రాజశేఖర్ మరియు జీవిత గారి చిన్న తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ తెరకు పరిచయం అవుతున్న సినిమా దొరసాని. కొన్నేళ్ళక్రితం తెలంగాణ ప్రాంతంలో దొరల పాలన సమయంలో జరిగిన ఒక యదార్ధ గాథను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలు మరియు ట్రైలర్, ఆ అంచనాలను పెంచేశాయనే చెప్పాలి.

ఇక ట్రైలర్ లో గ్రామీణ నేపథ్యంలో హృద్యంగా సాగె సన్నివేశాలు, హీరో ఆనంద్ మరియు హీరోయిన్ శివాత్మిక పలికిన డైలాగులు, అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా పై మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించినట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కె.వి.ఆర్. మహేంద్ర రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పిస్తుండగా, మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here