హైదరాబాద్ దేవి 70ఎంఎం లో సమంత భారీ కటౌట్ ఏర్పాటు….!!

0
457

టాలీవుడ్లో తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన నటి అక్కినేని సమంత. ఇటీవల భర్త నాగచైతన్య తో కలిసి మజిలీ సినిమాతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత, ప్రస్తుతం నటిస్తున్న కొత్త చిత్రం ఓ బేబీ. ఒక కొరియన్ చిత్ర అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలు ఇటీవల విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టాయి. సమంత ఒక సరికొత్త పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వినోద భరితంగా సాగుతూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా ఉంది . ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, తేజ సజ్జ, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా మహిళా దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర కథానాయిక సమంత భారీ స్థాయి కటౌట్ ని హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో గల దేవి 70ఎంఎం థియేటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా అగ్రహీరోలకు ఇంత భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం చూస్తుంటాం, అయితే ఒక కథానాయికకు ఇంత పెద్ద కటౌట్ పెట్టడంతో సమంత క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక దేవి థియేటర్ వద్ద చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ కటౌట్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here