టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ మరియు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పాటలు మాత్రమే కాక, నిన్న యూట్యూబ్ లో విడుదలైన ట్రైలర్ సైతం వీక్షకుల మదిని గెలిచి ప్రస్తుతం 2 మిలియన్లకుపైగా వ్యూస్ తో అలానే 121 వేలకుపైగా లైకులతో దూసుకుపోతోంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోగా, అందులో ముఖ్యంగా అదరగొట్టే తెలంగాణా మాండలికంలో రామ్ పలికిన డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెరసి ట్రైలర్ ని వీక్షకులకు ఎంతో చేరువ చేసాయి.
ట్రైలర్ కు ఇంతటి అద్భుతమైన స్పందన వస్తుండడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం కూడా తప్పకుండా అలరిస్తుందంటోంది. రామ్ సరసన అందాల భామలు నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు సంగీతం మరియు నేపధ్య సంగీతాన్ని అందిస్తుండగా, పూరి సినిమా టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈనెల 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు…..!!


