ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ది లయన్ కింగ్. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేటెడ్ డిస్నీ కామిక్ గా విడుదలై అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన లయన్ కింగ్, ప్రస్తుతం త్రీడి చిత్రం రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఇంగ్లీష్ ట్రైలర్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టడంతో ప్రస్తుతం ఈ చిత్రాన్ని పలు ఇతర భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను కాసేపటి క్రితం చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలైన ముఫాసా, మరియు సింబ పాత్రలకు తెలుగు నటులు జగపతిబాబు మరియు నాని తమ గాత్రాన్ని అందించడం జరిగింది.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు గడించిన రవిశంకర్ కూడా ఈ చిత్రానికి తన గాత్రాన్ని అందించారు. అంతేకాక ప్రముఖ తెలుగు హాస్యనటులు బ్రహ్మమందం, ఆలీ కూడా ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య పాత్రలకు తమ గాత్రాన్ని అందించి డబ్బింగ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం విడుదలైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇటీవల హాలీవుడ్ సహా పలుభాషల్లో విడుదలై అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న ‘జంగిల్ బుక్’ చిత్ర దర్శకుడు జాన్ ఫవ్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 19న ప్రప్రంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ..!!


