అ! వంటి విభిన్న తరహా చిత్రంతో మొదటి సినిమాకే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈసందర్భగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ.
క్లైమాక్స్ ముందు రాసుకుని తరువాత స్టోరీ రాస్తారా?
– అవునండీ. కథంటేనే నా దృష్టిలో క్లైమాక్స్. క్లైమాక్స్ లేనిదే కథ లేదు. అందుకే నేను ముందు క్లైమాక్స్ రాసుకుని కథ రాసుకుంటాను. డెస్టినేషన తెలుసుకుంటే, దానికి తగ్గట్టు కథను రాసుకోవచ్చు. డెస్టినేషన్ తెలియకపోతే ఎక్కువ సమయాన్ని దాని మీద పెట్టాల్సి వస్తుంది.ముందు క్లైమాక్స్ రాసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.
ముందు క్లైమాక్స్ రాసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం?
– క్లైమాక్స్ నాకు ఎప్పుడూ పెద్ద పే ఆఫ్ అవుతుంది. ప్రతి ఒక్క ట్విస్ట్ ని ప్రతి 15 నిమిషాలకు రివీల్ చేస్తూ వెళ్లడం ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. అన్నిటినీ ముడి వేసి చివరగా రివీల్ చేయడం మరొక స్క్రీన్‌ప్లే. కొన్ని కథలకు ఇలాంటి స్క్రీన్ ప్లే మెయిన్ అవుతుంది.
మీ ఫస్ట్ సినిమా `అ!`లోకూడా అలాగే చివరి వరకు కూర్చోపెడతారు. మీ సినిమాలు ఇలాగే ఉంటాయని ముద్రపడదా?
– టైప్ కాస్ట్, స్టీరియో టైప్ సినిమాలు చేయను. కెరీర్ వైజ్ పర్టిక్యులర్ జోనర్‌కి నేను స్టక్ కాదలచుకోలేదు. అందుకే నా తర్వాతి చిత్రాలు ఆ జోనర్‌లో ఉండవు.
ఈ సినిమాకు ఒకటే వెర్షన్ రాసుకున్నారా లేదా ఇంకా ఉన్నాయా?
-`కల్కి`కి క్లైమాక్స్ వర్షన్స్ 16 రాశాం. అందులో నాకు హైఅనిపించింది ఈ వెర్షన్. నాకే కాదు, ఎవరికి ఏది ఎక్కువ నచ్చితే దాన్ని పెడతాం.
అ! తర్వాత మీకు బాగా అప్రిషియేషన వచ్చింది.పెద్ద హీరోలు అప్రోచ్ కాలేదా?
– నిజం చెప్పాలంటే ఎవరూ అప్రోచ్ కాలేదు. పెద్ద ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు.
కమర్షియల్ గానూ హ్యాండిల్ చేయగలనని చెప్పడానికి ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారా?
– అవునండి. కమర్షియాలిటి కోసమే మూవీ లో కొన్ని ఎలివేషన్స్ పెట్టడం జరిగింది.
అ! సినిమా కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ కదా?
– అది కమర్షియల్ హిట్ అండీ. సక్సెస్ మీట్ చేయకపోవడం వల్ల చాలా మంది అది కమర్షియల్ కాదేమో అని అనుకుంటున్నారు. కానీ నిజానికి అది కమర్షియల్ హిట్. రూ.5 కోట్లలో చేశాం. రూ.15కోట్లు గ్రాస్ వచ్చింది. రిలీజ్ చేసిన తర్వాత చాలా సినిమాలకు ప్రమోషన్ చేస్తుంటారు. కానీ మేం చేయలేదు. అక్కడే తప్పు జరిగింది. `అ!` ఎ సెంటర్ సినిమా. బడ్జెట్ కూడా దానికి తగ్గట్టే చేశాం. కానీ `కల్కి` బీ సీ సినిమా. అందువల్ల ఎక్కువ బడ్జెట్ అయింది. దానికి తగ్గట్టే వసూళ్లు కూడా ఉన్నాయి.
నానిగారితో ఇప్పటికీ మీతో టచ్‌లో ఉన్నారా?
– రీసెంట్‌గా కూడా ఓ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం.
`కల్కి` కథ విషయంలో కథ నాది అని ఎవరో అన్నారు.
– అన్నమాట వాస్తవమే. మేం స్క్రిప్ట్ రచయితల సంఘంలో సబ్మిట్ చేశాం. కథ నాది అన్న అతను కూడా సబ్మిట్ చేశాడు. వాళ్లు మా కథలు చదివారు. కథలు వేర్వేరని అర్థమైపోయింది.
కేజీఎఫ్ లా ఉందని కొందరు అంటున్నారు?
– నేను ఆ సినిమాను చూసి కొన్ని ఇంప్రువైజేషన్స్ చేసిన మాట నిజమే. కేజీఎఫ్‌కి వెళ్లి చూశాను. హీరో ఎలివేషన్ ఆ సినిమాలో చాలా బాగా చేశారు. అందుకే చూశా.
రెస్పాన్స్ ఎలా వస్తోంది?
– ఈ సినిమా ఏ సెట్ ఆడియన్స్ కి చేరువవ్వాలని చేశామో, వాళ్లకి చేరువైంది. సంధ్య థియేటర్‌కి వెళ్లాం. అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, జనాలు వచ్చి డ్యాన్సులు చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. నా సినిమాకు వాళ్లు అలా చేస్తుంటే ఆనందంగా ఉంది.
మూడో సినిమా గురించి?
– ఈ సినిమా కలెక్షన్స్ ని బట్టి మూడోది తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసిన రెండు సినిమాలకన్నా మూడోది భిన్నంగా ఉంటుంది. కల్కి రిజల్ట్ ని బట్టి, చేయబోయే హీరో ధైర్యాన్ని బట్టి మూడో సినిమా చేస్తాం.
ఈ సినిమాకు ముందు మీరు చేసిన హోమ్ వర్క్ ఎలాంటిది?
– నా స్ట్రెంగ్త్, వీక్‌నెస్‌లు రాసుకున్నాను. థియేటర్లకు జనాలను ఎలా తీసుకుని రావాలని రాసుకున్నా. నేను వెళ్లి ఈ సినిమా చూస్తానా లేదా అనేది ఆలోచించి కథ రాసుకున్నాం.
రాజశేఖర్‌తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఏంటి?
– ఆయన గురించి ముందే తెలిస్తే దాన్ని బట్టి మనం షూటింగ్ చేసుకోవచ్చు. స్టార్ రాకముందు మనం లొకేషన్‌లో చాలా షూటింగ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టే షాట్స్ బెటర్‌గా ప్లాన్ చేసుకున్నా. క్వాలిటీ బెటర్‌గా వచ్చింది.
మీరు డైరక్ట్ చేయాలని అనుకోలేదట కదా?
– స్క్రిప్ట్ 6 నెలలు టీమ్‌తో కలిసి చేసుకున్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. నా కెరీర్‌కు కూడా చాలా ఉపయోగపడుతుందనిపించింది. కమర్షియల్‌గా చేద్దామనిపించింది. రాజశేఖర్‌గారు, వాళ్ల ఫ్యామిలీ కూడా చాలా సెన్సిబుల్‌గా అనిపించారు.
మీ ఫ్రెండ్ శ్రవణ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది కదా?
– నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు శ్రవణ్ నాకు ఫ్రెండ్. తనకి మంచి సినిమా పడాలని ఇచ్చాను. మా అందరి కన్నా శ్రవణ్‌కి, అతను చేసిన రీరికార్డింగ్‌కి ఎక్కువ పేరొచ్చింది.
డైరక్షన్‌లో జీవితగారి ఇన్వాల్వ్ మెంట్ ఉందా?
– ఆమెకు వచ్చిన ఐడియాను చెప్పారు. నాకు సెన్సిబుల్‌గా అనిపిస్తే ఓకే. లేకుంటే నో ప్రాబ్లమ్ అని అన్నారు. నాకు ఎవరు మంచి ఐడియా చెప్పినా నేను ఓకే చేస్తాను. వాళ్లకు క్రెడిట్ కూడా ఇస్తాను.
మీకు దర్శకుడిగా ఇన్స్పిరేషన్ ఎవరు?
– సినిమాను బట్టి మారుతుంది. `కల్కి`సినిమా చేసేటప్పుడు నేను మాస్ మసాలా సినిమాలు చేశాను. మామూలుగా హాలీవుడ్ సినిమా దర్శకుల ఇన్ స్పిరేషన్ ఉంటుంది.
వారి స్టైల్‌ని కాపీ కొడుతున్నట్టు అనిపించలేదా?
– నా సినిమాలు రెండిటిలోనూ స్టైల్ ఎక్కడా లేదు. ఇంకో రెండు, మూడు సినిమాల తర్వాతైనా వస్తుందో రాదో నాకు తెలియదు. ఇప్పుడు ఒక సినిమాను శేఖర్‌కమ్ములగారి స్టైల్లో తీయాలనుకున్నప్పుడు ఆయన్ని కాపీ కొట్టడానికి నాకేం ఇబ్బంది లేదు.
మీ చుట్టూ పుస్తకాలు చాలా ఉన్నాయి..
– నేను చదువుకున్న స్కూల్లో ఉపనిషత్తులు వంటివి చాలా చదివించారు. కల్కిలోనూ పురాణాల ప్రభావం కనిపిస్తుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
– కొందరికి కథలైతే చెప్పా. నిర్మాత మార్కెట్, డేట్స్ వంటివాటిని బట్టి తర్వాత దాన్ని ఆలోచించాలి. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారు. వాటిలో ఏది ముందు ఉంటుందో తెలియదు. ఓ వెబ్‌సీరీస్ వర్క్ చేస్తున్నాను. హాట్ స్టార్‌కి. ఆ సబ్జెక్ట్ ను సినిమాగా చేయలేం. అది ఫ్యామిలీ థ్రిల్లర్. నాకే కొత్తగా అనిపించింది. అందుకే దాన్ని చేస్తున్నా. మాకు స్క్రిప్ట్ కోసం ఓ ఆఫీస్ ఉంది. మా సిస్టర్ దాన్ని డీల్ చేస్తోంది. మా టీమ్‌లో మ్యారీడ్ విమెన్ ఉన్నారు. అసలు సినిమాల గురించి తెలియనివారున్నారు. అంత మంది ఉండటం వల్ల డిఫరెంట్ పర్‌స్పెక్టివ్స్ వస్తాయి. మోర్ ఇంట్రస్టింగ్ ప్రాడక్ట్ వస్తుంది. వాటిలో ఏది కరెక్టో, ఏది రాంగో నా సిస్టర్ చూసుకుంటుంది. అంటూ ఇంటర్వ్యు ముగించారు ప్రశాంత్ వర్మ.