బ్రోచేవారెవరురా చిత్రాన్ని అభినందించిన నటుడు అడివి శేష్….!!

0
89

జూన్ 28 న విడుదలై మంచి ప్రేక్షకాభిమానంతో దూసుకుపోతున్న చిత్రం బ్రోచేవారెవరురా. విలక్షణ నటుడు శ్రీవిష్ణు, హాస్య నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నివేత థామస్, సత్యదేవ్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రముఖ నటుడు అడివి శేష్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.

నేడు బ్రోచేవారెవరురా చిత్రం చూసాను, చాలా బాగుంది. ఇక నా స్నేహితులు నివేత, ప్రియదర్శి, సత్యదేవ్ అదరగొట్టారు. ఇక యధావిధిగా శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ తమ సహజ నటనను కనబరచి మంచి మార్కులు సంపాదించారని అన్నారు. ఈ చిత్రంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ, తెలుగు సినిమాని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని అయన అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here