పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘అక్షర’….!!

0
474

నందిత శ్వేతా ప్రధాన పాత్రలో ఒక సామజిక అంశాన్ని తీసుకుని దానికి వినోదాన్ని జోడించి థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘అక్షర’.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  తమ చిత్రం ఆద్యంతం ఆకట్టుకునే కథ మరియు కథనాలతో సాగుతూ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం తమకు ఉందని అంటోంది చిత్ర బృందం.

ఎక్కువగా తన కెరీర్లో నెగిటివ్ రోల్స్‌లో కనిపించే పాత్రల్లో నటించిన అజయ్ ఘోష్, ఈ చిత్రంలో మాత్రం మంచి కామెడీ పాత్ర పోషించినట్లు సమాచారం. మధునందన్, షకలక శంకర్, సత్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు చిత్ర బృందం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. తన కెరీర్లో ఇటుటవంటి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర ఇప్పటివరకు చేయలేదని, తప్పకుండా ఈ చిత్రం తనకు తెలుగులో మంచి గుర్తింపునిస్తుందని నటి నందిత శ్వేతా అంటున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here