మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకులు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం వాల్మీకి. ఇటీవల తమిళంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న జిగర్తాండ చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ టీజర్ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మునుపెన్నడూ చూడని గ్యాంగ్ స్టర్ లుక్ లో వరుణ్ తేజ్ అమితంగా ఆకట్టుకున్నారు. ప్రీ టీజర్ విడుదల తరువాత చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ప్రస్తుతం ఈ ప్రీ టీజర్ 3 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తమిళ యువ నటుడు యాత్రావ మురళి కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


