రేపు విడుదల కానున్న కార్తికేయ ‘గుణ 369’ ఫస్ట్ లుక్ టీజర్…!

0
639

ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న యువ నటుడు కార్తికేయ. ఆ సినిమా తరువాత ఆయన నటించిన హిప్పీ సినిమా, నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న నూతన చిత్రం గుణ 369. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.  ఈ చిత్ర టీజర్ ని రేపు అనగా జూన్ 17న ఉదయం 11.11 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

రియ‌ల్ ల‌వ్ ఇన్సిడెంట్స్ తో ప్రముఖ దర్శకుడు బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ క‌థ‌ను అద్భుతంగా త‌యారు చేసి చిత్రీకరిస్తున్నారని, తప్పకుండా చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందని యూనిట్ నమ్మకంగా ఉంది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆర్‌ఎక్స్‌ 100 ఫేం రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా గుణ 369 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here