సప్త‌గిరి, వైభ‌వి జోషి జంట‌గా న‌టించిన సినిమా `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కుడు. శివ శివ‌మ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. బేబీ శాస్త్ర స‌మ‌ర్పిస్తున్నారు. న‌రేంద్ర య‌డ‌ల‌, జీవీయ‌న్ రెడ్డి నిర్మించారు. బ్ర‌హ్మ‌య్య విడుద‌ల చేస్తున్నారు.ఈ నెల 14న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ను నిర్వ‌హించింది.

స్టార్ కమెడియన్ స‌ప్త‌గిరి మాట్లాడుతూ “నా సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డింది. మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నా గ‌త చిత్రాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. టీమ్ అంద‌రం క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాం. నిర్మాత‌లు మంచి స‌పోర్ట్ ఇచ్చారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు అంద‌రూ త‌మ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ ప్రాణాల‌కు తెగించి మ‌రీ బెలూన్ కేవ్స్ సీన్‌లో న‌టించింది. ఈ సినిమాకు శ్రీకాంత్‌గారు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి ప్రాణం పోశారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు“ అని అన్నారు.

నిర్మాత జి వి ఎన్ రెడ్డి మాట్లాడుతూ “మా సినిమా రెండు రోజుల్లో విడుద‌ల కానుంది. సినిమాను అంద‌రూ పెద్ద హిట్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. స‌ప్త‌గిరి ఈ సినిమాకు చాలా స‌పోర్ట్ చేశారు“ అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా నిర్మాత‌లు లేక‌పోతే ఈ సినిమా లేదు. చాలా బాగా స‌పోర్ట్ చేశారు. సినిమా విడుద‌లవుతుంటే ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. 70-80 శాతం కామెడీ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా బావుంది. ఉత్కంఠ‌గా సాగే స‌న్నివేశాలుంటాయి. యాక్ష‌న్‌లోనూ కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ బావుంటుంది. ఆక‌లి మీదున్న సింహంలాగా మా సినిమా ఉంది“ అని చెప్పారు.

హీరోయిన్ వైభ‌వి జోషి మాట్లాడుతూ “ఈ సినిమాలో కామెడీ చాలా ఉంటుంది. మా కుటుంబ‌స‌భ్యుల‌కు తెలుగు రాక‌పోయినా కూడా ప‌డీ ప‌డీ న‌వ్వారు. సినిమా త‌ప్ప‌కుండా పైసా వ‌సూల్ మూవీ అవుతుంది“ అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు ప‌లువురు పాల్గొన్నారు.

స్టార్ కమెడియన్ సప్తగిరి, వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్‌ వంశీ, అప్పారావు, అవినాష్‌, రాజేంద్ర జాన్‌ కొట్టోలి, వీరేన్‌ తంబిదొరై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, ఎడిటింగ్‌: కిషోర్‌ మద్దాలి, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌,, కథ: జి.టి.ఆర్‌. మహేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలాన బాలగోపాలరావు,ప్రొడ్యూసర్స్ : నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్‌ పవార్‌.