ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘క్లాప్‌’ చిత్రం ప్రారంభం

0
57

ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తున్న సినిమా `క్లాప్‌`. ఆకాంక్ష సింగ్ నాయిక‌. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్, శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాంజ‌నేయులు స‌మ‌ర్పిస్తున్నాయి. ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఈ చిత్రం ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో బుధ‌వారం ఉద‌యం జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా తెలుగు వెర్ష‌న్‌కు క్లాప్ కొట్టారు. త‌మిళ వెర్ష‌న్‌కు హీరో నాని క్లాప్ కొట్టారు. ద్విభాషా చిత్ర‌మిది. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్ ను బోయ‌పాటి శ్రీను, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, గోపీచంద్ మ‌లినేని అందించారు. సి.క‌ల్యాణ్‌; స‌ందీప్ కిష‌న్ త‌దిత‌రులు అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ద‌ర్శ‌కుడు ప్రిత్వి ఆదిత్య‌ మాట్లాడుతూ “దాదాపు ఏడాది ముందు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్టాం. 400 మీట‌ర్ల స్పింట‌ర్‌ క‌థను గొప్ప‌గా చెబుతున్నాం. ఒక వ్య‌క్తికి సంబంధించిన గ‌తం ఎలా ఉంది? ప‌్రెజెంట్ లో ఎలా ఉన్నాడు అనే క‌థ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. నేను క‌థ అనుకోగానే ఆదిగారు గుర్తుకొచ్చారు. ఆయన చాలా పాజిటివ్ వ్య‌క్తి. ఆయ‌న‌లోని అంకిత‌భావం, ప‌ట్టుద‌ల ముచ్చ‌ట‌గా అనిపిస్తాయి. ఇళ‌య‌రాజాగారు, నానిగారు, అల్లు అర‌వింద్‌గారు… ఇంత మంది గెస్ట్ లు మా సినిమా ఓపెనింగ్‌కి రావ‌డం ఆనందంగా ఉంది“ అని చెప్పారు.
హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ “బైలింగ్వుల్ చిత్ర‌మిది. ఒకేసారి తెలుగు, త‌మిళ్‌లో తెర‌కెక్కిస్తున్నాం. స్ట్రాంగ్ టెక్నిక‌ల్ టీమ్ ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్నారు. ద‌ర్శ‌కుడు నాకు క‌థ చెప్ప‌గానే వెంట‌నే నేను ఓకే చెప్పేశాను. హార్ట్ ట‌చింగ్ అంశాలు ఇందులో చాలా ఉంటాయి. చాలా ఇఫ‌రెంట్ స‌బ్జెక్ట్ ఇది. ద‌ర్శ‌కుడు ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ఈ సినిమాలోనూ కాన్ఫిడెన్స్ తోపాటు, త‌ప‌న కూడా క‌నిపిస్తుంది. నాతో సినిమా చేయాల‌ని నిర్మాత కార్తికేయ‌న్ నా `మృగం` స‌మ‌యం నుంచి అడుగుతున్నారు. మా ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టికి సినిమా కుదిరింది. ఈ సినిమాలో ఇళ‌య‌రాజాగారు ఉండ‌టం మా అదృష్టం. ప్ర‌కాష్‌రాజ్‌గారు, న‌రేన్‌, నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, అన్న‌పూర్ణ‌మ్మ‌గారు… ఇలా రెండు భాష‌ల‌కు సూట్ అయ్యే ఆర్టిస్టుల‌ను ఎంపిక చేసుకుని సినిమా చేస్తున్నాం“ అని అన్నారు.

నిర్మాత ప్ర‌భాప్రేమ్ మాట్లాడుతూ “ఈ నెల 17 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేస్తాం“ అని అన్నారు.

చిత్ర సమర్పకులు రామాంజ‌నేయులు మాట్లాడుతూ “ హైద‌రాబాద్‌, బెంగుళూరు, చెన్నై, మ‌దురైలో షూటింగ్ చేస్తాం. ఈ నెల 17 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమా మ‌ధ్య‌లో రెండు నెల‌లు గ్యాప్ ఇచ్చిన త‌ర్వాత మ‌ళ్లీ మొద‌లుపెడ‌తాం. ఆసమ‌యంలో హీరో స్పింట‌ర్‌గా శిక్ష‌ణ పొందుతారు“ అని చెప్పారు.

డీఓపీ ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ “నేను స్టార్ స్పోర్ట్స్ లో చాలా డాక్యుమెంట‌రీలు చేశాను. ఈ సినిమాను అలెక్సా 6 , ప్రైమ్ సుప్రీమ్ కెమెరాల‌తో షూట్ చేస్తాం“ అని అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా ఉంటుంది. ఇంత మంచి కాన్సెప్ట్ కు న‌న్ను ఎంపిక చేసుకున్న ద‌ర్శ‌కుడికి ధ‌న్య‌వాదాలు“ అని అన్నారు.

న‌టీన‌టులు
నాజ‌ర్‌, ప్ర‌కాష్‌రాజ్‌, క్రిష కురూప్‌, బ్ర‌హ్మాజీ, ముండాసుప‌ట్టి రామ్‌దాస్‌, మైమ్ గోపి, సూర్య‌, మీనా వాసు త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

ద‌ర్శ‌క‌త్వం: ప్రిత్వి ఆదిత్య‌
కెమెరా: ప్ర‌వీణ్ కుమార్‌,
సంగీతం: మేస్ట్రో ఇళ‌య‌రాజా
ఆర్ట్: వైర‌బాల‌న్‌
తెలుగు మాట‌లు: వ‌న‌మాలి
ఎడిట‌ర్‌: రాగుల్‌
స్టంట్స్: శ‌ర‌వ‌ణ‌న్‌
వీఎఫ్ ఎక్స్: అక్ష స్టూడియోస్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: షేర్ అలీ.ఎన్‌,
స‌మ‌ర్ప‌ణ‌: రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌: బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్, శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్
నిర్మాత‌లు: ఐ.బి.కార్తికేయ‌న్‌, ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి
స‌హ నిర్మాత‌లు: పి. ప్ర‌భా ప్రేమ్‌, (పీఎంఎం ఫిల్మ్స్, జి. మ‌నోజ్‌), జి. శ్రీ హ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here