జూన్ 14న సమంత ‘ఓ బేబీ’ నుండి మూడవ పాట విడుదల….!!

0
143

సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఓబేబీ. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను చిత్ర బృందం యూట్యూబ్ ద్వారా విడుదల చేయగా అవి ప్రేక్షకుల మనసు దోచాయి. ‘చాంగు భళా’ అనే పల్లవితో సాగె పాటను ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృదం నుండి ఒక ప్రకటన వెలువడింది.

సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తుండగా, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక కొరియన్ చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రానున్న ఈ చిత్రంలో సమంత ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here