‘కిల్లర్’ మూవీ సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చింది : విజయ్ అంథోని

0
521

నకిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమైన నటుడు విజయ్ అంథోని. స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్, అంతకముందు పలు తమిళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అయితే నటన పై ఆసక్తితో హీరోగా మారిన అయన, 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై, అతి పెద్ద విజయాన్ని అందుకుంది బిచ్చగాడు. ఇక ప్రస్తుతం అయన నటించిన కొత్త సినిమా కిల్లర్, మొన్న బుధవారం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ముందుకు సాగుతోంది.

ఇక నిన్న చిత్ర సక్సెస్ పై మీడియాతో విజయ్ కాసేపు ముచ్చటించారు. అయన మాట్లాడుతూ, బిచ్చగాడు తరువాత కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ, తనకు ఖచ్చితంగా త్వరలో హిట్ వస్తుందని గట్టి పట్టుదలతో ఈ సినిమా చేయడం జరిగిందని అన్నారు. అయితే అనుకున్న విధంగా తమ చిత్రం సక్సెస్ టాక్ ని సంపాదించడం తనకు ఎంతో సంతోషన్నిచ్చిందన్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు ఆండ్రూ తనకు మంచి మిత్రుడని, అయన చిత్రాన్ని ఎంతో కష్టపడి చిత్రీకరించారని అన్నారు. ఇకపోతే సినిమాలో అర్జున్ గారు చేసిన పోలిస్ ఆఫీసర్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అని అన్నారు. ఇక ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించిన తమ చిత్ర బృందానికి, మరియు చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here