సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున అభిమానులకు మహేష్ కొత్త కానుక

0
534

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఘట్టమనేని అభిమానులకు మహేష్ బాబు తీపి కానుక అందజేశారు. తన కొత్త 26వ చిత్రాన్ని ఘనంగా అనౌన్స్ చేశాడు. ఈ వేసవి కానుకగా విడుదలైన మహర్షి మూవీ రికార్డులు బద్దలు కొట్టి ఇంకా సందడి చేస్తుండగానే మహేష్ బాబు తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయడం ఆసక్తి రేపుతోంది.

మహేష్ బాబు దూకుడు చూస్తుంటే.. ఇకపై సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ తీసుకునేలా కనిపించడం లేదు. అందుకే కృష్ణ పుట్టిన రోజు అయిన ఈ మే 31న తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నట్టు మహేష్ బాబు ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానులకు కానుకను అందించారు. గురువారం అర్థరాత్రి 12 గంటలకు మహేష్ తన 26వ చిత్రానికి సంబంధించిన సర్ ప్రైజ్ ను ఇచ్చారు.

మహేష్ ఈ సినిమాను ప్రకటించడంతోపాటు టైటిల్ ను కూడా విడుదల చేయడం విశేషం. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ను మహేష్ స్వయంగా ఫస్ట్ లుక్ గా విడుదల చేశాడు. దిల్ రాజ్, అనిల్ సుంకర, ఘట్టమనేని మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మహర్షి తర్వాత మహేష్ బాబుపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోందని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత  మహేష్ చిత్రంలో నటిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఫస్ట్ లుక్ ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ పక్కన తుపాకీ, పోలీస్ టోపీ పెట్టడంతో ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ గా నటించబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది. మరి ఈ వార్తలకు దర్శకుడు ఈరోజు క్లారిటీ ఇస్తాడేమో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here