‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్ ఆగయా..

0
468

పూరీ జగన్నాథ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన డైరెక్టర్. హీరోల మేనరిజాన్ని.. దూకుడును చూపించడంలో పూరిని మించిన దర్శకులు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ లో తీసిన సినిమాలన్నీ ఆయా హీరోల జీవితాల్లో మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. పూరి జగన్నాథ్ ఈసారి అంతే దూకుడైన హీరోను పట్టుకున్నారు. రామ్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ దుమ్ముదులిపింది. రామ్ దూకుడు, స్టైలిష్ చూసి ఎప్పుడూ లేని సరికొత్త దారిలో పూరి తన సినిమాను తీర్చిదిద్దినట్లు అంచనాలు వెలువడ్డాయి.

ఇప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్ ’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రామ్ కూడా తన లుక్ తో ఆడియెన్స్ ను అట్రాక్ చేశాడు. రామ్ లుక్ అయితే మాస్ ఆడియెన్స్ ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రామ్, పూరి జగన్నాథ్ లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. సినిమా విడుదల తేదీని పూరి అనౌన్స్ చేశాడు. జులై 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సినిమాలోని యాక్షన్ సీన్స్ పూరి స్టైల్ కి తగ్గట్టుగా ఉంటాయని.. ఈసారి అభిమానుల అంచనాలు అందుకుంటారని నమ్మకంగా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here