ఫలక్ నుమా దాస్.. పక్కాలోకల్.. హైదరాబాదీ కహానీ..

0
133

ఆంధ్రాలో ఒక యాస.. తెలంగాణలో మరో యాస.. కానీ హైదరాబాదీ యాస ప్రత్యేకం.. అన్నీ మిక్స్.. డిఫెరెంట్ యాటిట్యూడ్. తెలంగాణ యాసలోనే ఊరమాస్ మాండలికం.. అందుకే చాలా సినిమాల్లో హైదరాబాదీ మేనరిజం హిట్ అయ్యింది.. నవ్వులు పూయించింది.

ఇప్పుడు తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు టేకప్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఎన్నో కలికితురాయి లాంటి అద్భుత సినిమాలను ఎంపిక చేసి వారికి ప్రోత్సాహాన్ని అందించి తన బేనర్ పై విడుదల చేయిస్తూ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటారు. ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాదు.. కేరాఫ్ కంచరపాలెం సినిమా విషయంలోనూ సురేష్ బాబు, రానా ఇలా ప్రోత్సహించి ఇండస్ట్రీకి హిట్ ను ఇచ్చారు. ఇప్పుడు అదే కోవలో ‘ఫలక్ నుమా దాస్’ సినిమాను కూడా సురేష్ బాబు విడుదల చేస్తున్నారు.

విశ్వక్ సేన్ దర్శకత్వంలో కరాటే రాజు నిర్మాతగా విడుదలవ్వబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి తదితర కొత్త నటులు నటిస్తున్నారు.

ఈ సినిమా హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో జరిగినట్టు ట్రైలర్ లో చూపించారు. చిన్నప్పటి నుంచే గ్యాంగ్ వార్ ల మీద మోజు పెంచుకున్న దాస్ తన ఏరియాలో తిరుగులేని లీడర్ గా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించారు. దానికి తగ్గట్టే చాలా దూకుడుగా పాత్రలు ఇందులో ఉన్నాయి. గల్లీలో మటన్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి.. అదే వ్యాపారం చేస్తున్న వ్యతిరేకులకు టార్గెట్ అయ్యి ఎలా కక్షలు, కార్పణ్యాలతో సినిమా నడిచిందనేది సినిమాలోని మెయిన్ పాయింట్. యూత్ ఫుల్ క్రైమ్ స్టోరీస్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. త్వరలోనే  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఫలక్ నుమా దాస్’ సినిమా ట్రైలర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here