టాలీవుడ్ లో నాన్ లోకల్ హీరోయిన్ల హవా

0
666

తెలుగు సినిమాల్లో హీరోయిన్లందరూ ఎక్కువ శాతం ఉత్తరభారతం నుంచి దిగుమతి అయిన వారే.. స్టార్ హీరోల పక్కన ఈ ఉత్తరాది ముద్దుగుమ్మలే ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటారు.. తెలుగు హీరోయిన్లు కూడా టాలీవుడ్ పై చెరగని ముద్రవేశారు. ఈషా రెబ్బ, అంజలి, దివ్యశ్రీ, ప్రియాంక జువాల్కర్, తేజస్వి, చాందినీ చౌదరి, కలర్స్ స్వాతి, రీతూ వర్మ తదితరులు కూడా దూసుకొస్తున్నారు..సత్తా చాటుతుకున్నారు. దక్షిణాదివారికి అవకాశాలు వస్తున్నాయి. అయితే వీరితోపోల్చితే ఉత్తరాది హీరోయిన్ల ప్రభావం తెలుగు సినిమాల్లో కాస్త ఎక్కువగా ఉంది.

ఉత్తర భారతదేశంలో మోడలింగ్ ను అమ్మాయిలు ఫ్యాషన్ గా వృత్తిగా, హీరోయిన్ గా ఎదగాలని ఎక్కువగా ఆశిస్తుంటారు. ఉత్తర భారతంలోని అమ్మాయిల శారీరక సౌష్టవం కాస్త ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఏజ్‌ అమ్మాయిలు కూడా శరీర సౌష్టవంతో కనిపిస్తూ ఉంటారు. 19 సంవత్సరాల సౌత్‌ అమ్మాయి, 16 లేదా 17 సంవత్సరాల నార్త్‌ అమ్మాయి ఒకే రూపంతో ఒకే శారీరక రూపంతో కనిపిస్తూ ఉంటారు. అంటే 16 లేదా 17 సంవత్సరాలకే నార్త్‌ అమ్మాయిలు పెద్ద వారిగా కనిపిస్తారు. కారణం వారి ఆహారపు అలవాట్లు మరియు అక్కడి చల్లటి వాతావరణం. నార్త్‌తో పోల్చితే సౌత్‌లో భిన్న సంప్రదాయ, సంస్కృతులు కూడా ఇక్కడ హీరోయిన్ కావడానికి అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపరు.

ఉత్తర భారతదేశంలో సంవత్సరంలో దాదాపు 9 నెలల పాటు అక్కడ చలిగానే ఉంటుంది. కేవలం మూడు నెలలు మాత్రమే ఎండగా ఉంటుంది. అలా నార్త్‌ ఇండియా మొత్తం వాతావరణం చల్లగా ఉండటం వల్ల వారు ఎక్కువ తెల్లగా ఉండటంతో పాటు, మంచి స్కిన్‌ టోన్‌ను కలిగి ఉంటారు. అందుకే మంచి కలర్, పర్సనాలిటీ గల ఉత్తరాది అమ్మాయిలను హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాతలు, దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మన తెలుగులో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, కియారా అద్వానీ లు కూడా ఉత్తరాది హీరోయిన్లు కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here