అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా ‘బ్రోచేవారెవరురా’ టీజర్‌ విడుదల

0
204

వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము.. చిత్రమే చలనము.. అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్‌ సెన్సేషన్స్‌ ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం యంగ్‌అండ్‌టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి విడుదల చేసారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ….

ప్రొడ్యూసర్‌ విజయ్‌ కుమార్‌ మన్యం మాట్లాడుతూ – ”బిల్డర్‌గా ‘నవ్య కన్‌ స్ట్రక్షన్స్‌ ‘ స్థాపించి వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించాం. ఇప్పుడు సినిమా రంగం లో మా ప్రొడక్షన్‌ హౌస్‌లో మొదటి సినిమా ‘బ్రోచేవారెవరురా’ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన అనిల్‌ రావిపూడి గారికి నా కృతజ్ఞతలు. అలాగే నేను వివేక్‌ ఆత్రేయ గారి మొదటి సినిమా ‘మెంటల్‌ మదిలో’ సినిమా ఫస్టాఫ్‌ చూసి మీతో సినిమా చేయాలనుంది అని ఆయనకు మెసేజ్‌ పెట్టాను. ఆయన తరువాత రెస్పాండ్‌ అయ్యి ఈ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది. నాకు బాగా నచ్చడంతో ఈ సినిమా స్టార్ట్‌ చేసాం. అలాగే హీరోగా విష్ణు చాలా బాగా నటించారు, రాహుల్‌, ప్రియదర్శి మంచి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. సత్యదేవ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు ఆయనకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌ అందరికి థాంక్స్‌. మా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అన్ని కార్యక్రమాలు జరిపి సినిమాను జూన్‌లో విడుదల చేస్తాం”అన్నారు.

రాహుల్‌ రామక ష్ణ మాట్లాడుతూ – ” నేను ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చేస్తున్న టైంలోనే వివేక్‌ ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఇంకా చాలా మాట్లాడతాను” అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ – ”మొదటి సారి తెలంగాణ మాండలికం కాకుండా గుంటూరు స్లాంగ్‌లో మా క్యారెక్టర్స్‌ రాసిన వివేక్‌ గారికి థాంక్స్‌. నేను ‘పెళ్లి చూపులు’ చేస్తున్నప్పుడు వివేక్‌ ఈ స్టోరీ గురించి చెప్పడం జరిగింది. విజయ్‌ గారు మంచి సపోర్ట్‌ అందించారు. గ్రేట్‌ టీమ్‌ అండ్‌ గ్రేట్‌ ఫన్‌. ముందు ముందు ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడతాను” అన్నారు.

హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ – ” చాలా మాట్లాడాలని ఉంది కానీ ట్రైలర్‌ విడుదలయ్యాక మాట్లాడతా. రాహుల్‌కి ‘అర్జున్‌ రెడ్డి, ప్రియదర్శి ‘పెళ్లిచూపులు చేస్తున్న టైమ్‌లో నేను ఖాళీ గానే ఉన్న ఆ టైమ్‌లో వివేక్‌ ఈ స్టోరీ చెప్పడం జరిగింది. వివేక్‌ గారు చాలా డిసిప్లేన్‌ డైరెక్టర్‌. కథకు ఎంతకావాలో అంతే పెర్ఫమ్‌ చేయించుకుంటారు. ప్రొడ్యూసర్‌ విజయ్‌ గారు అద్భుతమైన సపోర్ట్‌ ఇచ్చారు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.

డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ మాట్లాడుతూ – ” ఈ సంవత్సరం ‘ఎఫ్‌ 2’ తో సక్సస్‌ సాధించి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసిన అనిల్‌ రావిపూడి గారికి థాంక్స్‌. ఈ సినిమాలో ఆరుగురు అద్భుతంగా పెర్ఫమ్‌ చేశారు. ‘బ్రోచేవారెవరురా’ అంటే కాపాడేవారు ఎవరు? అని అర్ధం. ఎవరు ఎవర్ని కాపాడుతారో సినిమా చూసి తెల్సుకోవాలి. మంచి సపోర్ట్‌ అందించిన ప్రొడ్యూసర్‌ విజయ్‌ గారికి థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ నివేత థామస్‌ మాట్లాడుతూ – ” టీజర్‌ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సినిమాలో బాగా పెరఫామెన్స్‌ చేశాను. నేను వర్క్‌ చేసిన దాంట్లో వన్‌ అఫ్‌ ది బెస్ట్‌ టీమ్‌. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – ” నా మొదటి సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు అనిల్‌ క్లాప్‌ కొట్టడం జరిగింది. ఆ సినిమాకు నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా టీజర్‌ మళ్ళీ ఆయనే విడుదల చేశారు కాబట్టి అంతకంటే మంచి పేరు వస్తుందని నమ్మవుతున్నాను. షూటింగ్‌ చాలా ఫన్‌గా జరిగింది. సెట్లో ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్‌ చేసేవాళ్ళం. అలాగే నిర్మాత విజయ్‌ గారు మంచి సపోర్ట్‌ అందించారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు” అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ” టీజర్‌ ఎంత ఫన్‌గా ఉందో సినిమా కూడా అంతే ఫన్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రీ విష్ణు తన మొదటి సినిమాతోనే మంచి సక్సస్‌ అందుకున్నారు. ఈ సినిమాతో మరింత మంచి పేరు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రియదర్శి, రాహుల్‌ మంచి టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌లు. త్వరలోనే వారితో కలిసి వర్క్‌ చేస్తాను. వివేక్‌ సాగర్‌ ట్యూన్స్‌ చాలా బాగున్నాయి. నాకు అవ్వే స్ట్రైక్‌ అవుతున్నాయి. చలనమే చిత్రము, చిత్రమే విజయము” అన్నారు.

http://industryhit.com/t/2019/04/brochevarevarura-teaser-launch-pics/#!prettyphoto/0/

నటీనటులు:
శ్రీవిష్ణు, నివేదా థామస్‌, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామక ష్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
నిర్మాత: విజయ్‌ కుమార్‌ మన్యం
బ్యానర్‌: మన్యం ప్రొడక్షన్స్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం
ఎడిటర్‌: రవితేజ గిరిజాల
ఆర్ట్‌: రామాంజనేయులు
స్టైలింగ్‌ : శృతి కూరపాటి
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here