మహేష్ హీరోయిన్ పవన్ ట్రేడ్ మార్క్ పోజు!

0
6

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. తర్వాత నాగ చైతన్య సినిమా ‘దోచేయ్’ లో కూడా నటించింది. టాలీవుడ్ లో పెద్దగా విజయం సాధించలేదు కానీ బాలీవుడ్లో మాత్రం గట్టిగానే పాగా వేసింది కృతి. ఇక ఈ భామ సోషల్ మీడియాలో తెగ జోరు చూపిస్తూ ఉంటుంది. హాటు హాటు ఫోటో షూట్లలో పాల్గొనడం.. ఆ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి నెటిజనులకు నిద్రలేకుండా చేయడం ఈ భామకు ఫేవరెట్ హాబీ.

తాజాగా కృతి తన ఇన్స్టా ఖాతా ద్వారా అలానే ఒక ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. డార్క్ లాకర్ బ్లేజర్ ధరించిన ఈ భామ స్టైల్ లో క్లాస్ లో మాస్ ను కూడా కలిపింది. బ్లేజర్ ఫుల్ స్లీవ్స్ ను పైకి మడిచింది. బ్లేజర్ కు బటన్స్ పెట్టుకోకుండా ఉంచడంతో ఆమె ధరించిన వినూత్నమైన డిజైనర్ టాప్.. గ్రే కలర్ షార్ట్ మిడ్డీ కనిపిస్తున్నాయి. డీప్ వీ నెక్ కట్ తో పాటుగా షూ లేసుల మాదిరిగా నెట్ ఉండే టాప్.. పైగా అది మెడ వరకూ ఉండడంతో నెక్లెస్ లాంటి ఆభరణంలా కూడా కనిపిస్తోంది. అయినా జనాలకు విండోస్ 8 అని.. 10 అని చాలా వెర్షన్లే తెలుసు కానీ ఈ గ్లామరస్ లేసుతో వచ్చిన విండోలు మాత్రం వారికి కొత్తే.

ఈ ఫోటోలో ఇంకో హైలైట్ ఏంటంటే.. ఈ బాలీవుడ్ భామ పవన్ కళ్యాణ్ ను ఒక గుర్తుచేయడం. అదెలాగంటారా? పవన్ ట్రేడ్ మార్క్ పోజు తెలుసు కదా.. మంచి యాక్షన్స్ సీన్ ప్రారంభంలో చేతిని మెల్లగా మెడ దగ్గరకు పోనిస్తాడు.. ఈ కృతి సనన్ కూడా అలాగే చేసింది కాని కొంచెం బాలీవుడ్ టచ్ ఇచ్చింది. చేతిని తన ఎడమవైపుకు పెట్టకుండా కుడివైపుకు పెట్టింది.. పవన్ ఇలాంటి పోజు పెట్టినప్పడు పవర్ఫుల్ గా.. తీక్షణంగా చూస్తాడు.. కానీ కృతి మాత్రం సున్నితంగా సుకుమారంగా చూస్తోంది. ఈమధ్య పవన్ నటించిన పాత సినిమాలు ఎవైనా చూసిందేమో! ఏదైతేనేం.. ఈ ఫోటోలను పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 5 లక్షల లైకులు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here