ఫొటోస్టోరీ : కొడుక్కి సారి చెప్పిన నాని.. తప్పలేదు

0
8

చల్లని సాయంత్రం.. సూర్యుడు కొండల చాటుకు వెళ్లిపోయాడు.. లేలేత గాలుల చల్లగాలి మెలమెల్లగా తాకుతోంది. ఆ చల్లటి సాయంత్రం వేళ నాని ఓ నీటిసంద్రం పక్కన కూర్చున్నాడు.. పక్కనే అతడి గారాల కొడుకు జున్ను అలియాస్ అర్జున్ ఉన్నాడు. ఇద్దరూ సరదాగా ముచ్చట్లలో మునిగిపోయాడు.. ఆ అద్భుత చిత్రాన్ని నాని అంతే అందంగా తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అదే సమయంలో ‘సారీ రా జున్ను’ అంటూ తన కొడుకుకు క్షమాపణలు చెప్పాడు. అయితే అర్జున్ టీషర్ట్ మీద ఒక ఆసక్తికర క్యాప్షన్ రాసి ఉంది. ‘నా పేరును మా నాన్న దొంగిలించాడు’ అని ఉంది. ఇలా నాని ఎందుకు సారీ చెప్పాడు.. కొడుకు నుంచి పేరును ఎందుకు నాని దొంగిలించాడన్నది ఆసక్తిగా మారింది.

సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదు.. నెలలు, సంవత్సరాలు పడుతుంది. షూటింగ్ పేరిట సెలబ్రెటీలు తమ ఇంటికి దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ కొడుకు పుట్టినప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ లో యూరప్ లో ఉన్నాడు. ఆయన షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చేవరకు ఆయన కొడుకు అభిరామ్ పాకడం మొదలుపెట్టాడట.. ఇలా తీయని అనుభూతులను, ఆప్యాయతలను స్టార్లు మిస్ అవుతుంటారు. సినిమాల్లో నటించేవారికి ఇది తప్పదు.

ఇలానే నాని కూడా గడిచిన రెండేళ్లుగా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు తీస్తూ షూటింగ్ లోనే గడుపుతున్నాడు. కుటుంబానికి.. తన కొడుకు అర్జున్ అప్యాయతలకు దూరమయ్యాడు. అందుకే ఇప్పుడు జెర్సీ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొడుకుతో ఓ నీటి సంద్రం పక్కన వాలిపోయాడు. ఆప్యాయతను పంచుకున్నాడు.

ఇంతకీ నాని తన కొడుకుకు సారీ చెప్పడానికి కారణం ఏమై ఉంటుందని బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. జెర్సీ షూటింగ్ పేరిట ఇన్నాళ్లు కొడుకు దూరమయ్యానన్న బాధలో నాని ‘అలా సారీరా జున్ను’ అని పోస్టు చేశాడు. అదే సమయంలో జెర్సీ సినిమాలో తన పేరునే వాడావా నాన్న అంటూ కొడుకు ప్రశ్నించేలా టీషర్టుపై నానియే ముద్రించినట్టున్నాడు. కొడుకు పేరునే సినిమాల్లో పెట్టుకొని నాని ఇలా మురిసిపోయాడు. మొత్తంగా ఇలా తండ్రి కొడుకుల ఫొటో స్టోరీలో బోలెడన్నీ అర్థాలు పరమార్థాలున్నాయి.. వాటిని మనం ఎలా అన్వయించుకుంటే అలా అర్థమవుతుంది.. మంచి మనసుతో చూస్తే చాలు..

నాని తాజాగా చేసిన ట్వీట్ ఇదే
https://twitter.com/NameisNani/status/1118735188404703232

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here