రాంగోపాల్ వర్మ గారు మా అందరినీ కవచంలా కాపాడారు – విజయ్‌కుమార్‌, శ్రీతేజ్‌, యజ్ఞాశెట్టి

0
164

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో జివిఆర్‌జివి ఫిలింస్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. రిలీజ్‌కి ముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన ఈ చిత్రం మార్చి 29న వరల్డ్‌వైడ్‌గా అత్యంత గ్రాండ్‌గా రిలీజై సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌, (ఎన్టీఆర్‌), శ్రీతేజ్‌ (చంద్రబాబు), యజ్ఞాశెట్టి (లక్ష్మీపార్వతి)లు విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు..

వర్మ ఈ స్టోరితో మిమ్మల్ని అప్రోచ్‌ అయినప్పుడు మీ రియాక్షన్‌?

యాజ్ఞాశెట్టి: వర్మగారు ఈ స్క్రిప్ట్‌తో నా దగ్గరికి వచ్చినప్పుడే ఇది చాలా సెన్సిబుల్‌, కాంటవర్షియల్‌ సబ్జెక్ట్‌. ముందుగా దీనికి మీరు ప్రిపేర్‌ అయి ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత ఈ రోల్‌ గురించి వివరించడం జరిగింది. ఎందుకంటే.. ఇది ఒక ఛాలెంజింగ్‌ రోల్‌. పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ ఉంది. అలాంటి ఒక లెజెండరీ పర్సన్‌ అయిన ఎన్‌.టి.ఆర్‌గారి చరిత్రలో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్‌లో ఒక మైలుస్టోన్‌గా నిలిచింది.

శ్రీతేజ్‌: నా కెరీర్‌ స్టార్ట్‌ అయి 13 సంవత్సరాలైంది. ఈ ట్రావెలింగ్‌లో నాకొక బ్రేక్‌ కావాలి. దానికోసం ఎటువంటి క్యారెక్టర్‌ అయినా నటుడిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకొనే క్యారెక్టర్‌ కోసం పదురు చూస్తున్నాను. ఆ సందర్భంలోనే వర్మగారు ‘వంగవీటి’తో నాకు బ్రేక్‌ ఇచ్చారు. ఆ సినిమా ద్వారానే నాకు ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో రామ్‌గోపాల్‌ వర్మగారు ఈ క్యారెక్టర్‌ కోసం నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను ‘ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’ చిత్రంలో రాజశేఖర్‌ రెడ్డి పాత్ర చేస్తున్నాను. నటుడిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే క్యారెక్టర్‌ కాబట్టి ఒప్పుకోవడం జరిగింది.

విజయ్‌కుమార్‌: నాకు నాటక రంగంలో అనుభవం ఉంది. నేను సంవత్సరానికి దాదాపు 150 ప్రదర్శనలు ఇస్తుంటాను. గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం జరిగింది. ఆ నటరాజ స్వామివారి అనుగ్రహం వల్ల వర్మగారు నేను స్టేజిమీద ఎన్‌.టి.ఆర్‌.లా ఉంటానని సన్నిహితుల ద్వారా తెలుసుకొని నాకు ఫోన్‌ చేసి చెప్పి ఒక డైలాగ్‌ను పంపించి ఎన్‌.టి.ఆర్‌ ఆహార్యంతో చెప్పి ఆ వీడియో తనకు పంపమని చెప్పారు. ఆ వీడియో చూసిన తర్వాత వర్మగారు ఫోన్‌ చేసి హైదరాబాద్‌ రమ్మన్నారు.

నాటక రంగంలో ఎన్‌.టి.ఆర్‌. పాత్ర ఎప్పుడన్నా పోషించారా?
విజయ్‌కుమార్‌: నేను ఎక్కువగా పౌరాణిక నాటక ప్రదర్శన ఇస్తుండేవాణ్ణి. ఒక ప్రదర్శనలో నేను మొదటిసారి కృష్ణుడి పాత్ర పోషించాను. ఆ నాటకాన్ని చూసిన డా. సి.నారాయణరెడ్డిగారు స్టేజిమీద అచ్చం మా అన్న ‘ఎన్‌.టి.ఆర్‌గారు కన్పించారు. కృష్ణుడి పాత్ర వేసే ప్రతి ఒక్కరూ విజయ్‌కుమార్‌ వేసిన కృష్ణుడి నాటకం ఒక్కసారైనా చూడాలి.. అన్నారు.

‘ఎన్‌.టి.ఆర్‌’గారి పాత్ర కోసం మీరేమైనా రీసెర్చ్‌ చేశారా?
విజయ్‌కుమార్‌: ప్రతి ఒక్కరూ ఎన్‌.టి.ఆర్‌గారిని సినిమాల్లో చూడటమే తప్ప నిత్య జీవితంలో ఆయన ఎలా ఉంటారు అనేది చాలా తక్కువమందికి తెలుసు. ఎలెక్షన్‌ ప్రచారం కోసం ఎన్‌.టి.ఆర్‌గారు చాలాసార్లు మా ఏలూరుకి రావడం జరిగింది. నేను చిన్నప్పట్నించీ ఆయన అభిమానిని కాబట్టి ఆయన్ను బాగా అబ్జర్వ్‌ చేసేవాడ్ని. ఆయన ఠీవి, దర్పం, ఆ చూపు, ఆ హావభావాలు అన్నీ నాకు నచ్చి వాటిని అలవర్చుకోవడం జరిగింది. దానికి తోడు వర్మగారు కూడా చాలా విపులంగా నా క్యారెక్టర్‌ గురించి వివరించడం వల్లనే నేను ఆయన పాత్రలో ఇమిడిపోయాను.

http://industryhit.com/t/2019/04/lakshmis-ntr-team-press-meet-pics/

ఈ సినిమాలో ఎన్‌.టి.ఆర్‌గారి డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ చేశారు కదా! దాని గురించి చెప్పండి?
విజయ్‌కుమార్‌: నాటక రంగం వాడిని కాబట్టి క్లాసికల్‌ డ్యాన్స్‌లో అనుభవం ఉంది. ఊరూరా తిరుగుతూ నాట్య ప్రదర్శనలిచ్చేవాడ్ని. నేను అడుగుపెట్టిన ప్రతి రంగంలో గుర్తింపు తెచ్చుకోగలిగాను. ఆ అనుభవంతోనే ఎన్‌టిఆర్‌లా డ్యాన్స్‌ చేశాను.

లక్ష్మీపార్వతి పాత్రలో మీరంత ఒదిగిపోయారు కదా! ఆమె గురించి ఏమైనా రీసెర్చ్‌ చేశారా?
యజ్ఞాశెట్టి: ఈ సినిమా పూర్తయ్యేవరకు నేను లక్ష్మీపార్వతిగారిని కలవలేదు. సినిమా కంప్లీట్‌ అయ్యాక ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ఆవిడతో ఒక 5, 10 నిమిషాలు మాట్లాడాను. వర్మగారు ముందే నాకు ప్రాపర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చారు. నా లుక్స్‌, తెలుగు ప్రనౌన్షియేషన్‌ కోసం నన్ను స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. ఆమె తెలుగు, సంస్కృతం లిటరేచర్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌. ఈ సినిమాలో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్‌ ఉన్నాయి. వాటి ఉచ్ఛారణ కోసం నాకు ఒక మెంటర్‌ని ఇచ్చారు. ముందుగా ప్రిపేర్‌ అవడం వలన ఈ సినిమాలో చాలా సీన్స్‌ని సింగిల్‌ టేక్‌లోనే చేశాను. నా కాస్ట్యూమ్స్‌, మేకప్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో నేను. లక్ష్మీపార్వతిని అయితే ఎలా స్పందిస్తానో అలా నటించాను.

కంటిన్యూస్‌ మూడు బయోపిక్స్‌లో నటించారు కదా ?
శ్రీతేజ్‌: నేను ముందు నుంచి కూడా రెగ్యులర్‌ యాక్టర్‌గా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. నాగభూషణం, సిఎస్‌ఆర్‌, రావుగోపాల్‌ రావు, కైకాల సత్యనారాయణ, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌ ఇలా.. ప్రతి ఒక్కరూ ఒక పాత్రకి పాత్రకి సంబంధం లేని విలక్షణ పాత్రలు ఎన్నో పోషించారు. అవన్నీ మనం చూస్తుంటే ఈతరంలో కూడా అలాంటి నటనను చూపించాలనే కోరికతో దేవినేని నెహ్రూ, వంగవీటి రంగ, వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల లాంటి విలక్షణ పాత్రలను పోషించాను.

పొలిటికల్‌గా మూడు చాలా కీలక పాత్రలు కదా! ఏమైనా బెదిరింపులు వచ్చాయా?
శ్రీతేజ్‌: అలాంటివేమీ రాలేదండీ. నా ముందు సినిమాల్లో అలాంటి పాత్రల్లో నటించడం వల్ల ఒక నటుడిగానే చూశారు తప్ప వేరే రకమైన ఇంపాక్ట్‌ కలగలేదు. అందులోనూ వర్మగారు ముందు నుండి మాకు ఒక కవచంలా నిలబడ్డారు.
విజయ్‌కుమార్‌: ప్రేక్షకులు కూడా ఒక ఆర్టిస్ట్‌లానే చూస్తారు తప్ప పొలిటికల్‌గా మమ్మల్ని ఇన్‌వాల్వ్‌ చేయలేదు. అవసరాన్ని బట్టి రావణాసురుడిని క్రూరంగానూ, నవ వ్యాకరణ పండితునిగానూ చూపించారు.

మీ రెండు సినిమాలను ఆర్‌జివిగారే డైరెక్ట్‌ చేశారు కదా! వేరే దర్శకుడితో సినిమా ఎప్పుడు?
యజ్ఞాశెట్టి: తెలుగులో నా రెండు సినిమాలు ఆర్‌జివిగారు డైరెక్ట్‌ చేశారు. అయితే ఇటీవల 9 డైరీస్‌ అనే సినిమా పూర్తయింది. దానికి బాలాజీ దర్శకుడు. త్వరలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదలవుతుంది.

ఈ సినిమాలో మీ మేకప్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంది కదా! దాని గురించి?
– ఈ సినిమాకు బాలీవుడ్‌ సినిమా ‘సంజు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాకి వర్క్‌ చేసిన టెక్నీషియన్‌ అన్షుమాన్‌ గైక్వాడ్‌ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. ఆర్‌జివిగారు కూడా మేకప్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అందుకనే మా పాత్రలకి అంతటి అప్రిషియేషన్స్‌ వస్తున్నాయి.

అన్నీ రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు కదా! ఆ క్యారెక్టర్స్‌ ప్రభావం మీ మీద ఉంటుందా?
యాజ్ఞశెట్టి: అలాంటిదేమీ లేదండి. నేను రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఫిక్షనల్‌ క్యారెక్టర్స్‌ కూడా చేశాను. నేను అంబేద్కర్‌గారి భార్య అయిన రమాబాయి క్యారెక్టర్‌ చేశాను. అలాంటి పాత్రలు పోషించడం చాలా ఛాలెంజింగ్‌గా అన్పిస్తుంది. అలాగే ఒక నటిగా నేను కూడా అలాంటి పాత్రల ద్వారానే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోగలిగాను.

ఇప్పటివరకూ మీకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌?
విజయ్‌కుమార్‌: నాటక రంగం నుండి సినిమా రంగంకి వచ్చాక మొదటిసారి ఈ సినిమా ద్వారా నాకు మంచి కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. నా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి అచ్చం ఎన్టీఆర్‌లా చేశావని అన్నారు. అదంతా ఒక ఎత్తు అయితే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫోన్‌ చేసి ఆ మహానుభావుణ్ణి ఎవరైనా ఫిఫ్టీ పర్సెంట్‌ కన్నా ఎక్కువ ఇమిటేట్‌ చేయలేరు అనుకున్నాను. కానీ మీరు వందశాతానికి పైగా చేశారు.
శ్రీతేజ్‌: ఇటీవల నా మీద ‘మ్యాన్‌ ఆఫ్‌ ది డే ఫ్రైడే శ్రీతేజ్‌’ అని ఒక ఆర్టికల్‌ వచ్చింది. ఇంకా కొంతమంది సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు చూస్తుంటే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనిపించింది. ఈ 29 అనే ఫ్రైడే నా భవిష్యత్తుని మార్చి నా కెరీర్‌ని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళింది. చాలా హ్యాపీగా ఉంది.

సినిమా కొన్ని చోట్ల విడుదల కాకపోవడం ఎలా అన్పించింది?
– మా సినిమాను దాదాపు అందరూ చూశారు. మా స్వంత ఊరు అయిన ఏలూరులో సినిమా విడుదల కాలేదు. కానీ పక్కనే ఉన్న సత్తుపల్లి వెళ్ళి అందరూ సినిమాను చూసి నాకు ఫోన్‌ చేశారు. కొంతమంది బండ్లు కట్టుకొని తెలంగాణకు వచ్చి మరీ సినిమా చూశారు.

మూడు బయోపిక్స్‌లో నటిచడం ఎలా అన్పించింది?
శ్రీతేజ్‌: నేను ‘ఆదిత్య 369’ సినిమా చూసినప్పుడు టైమ్‌ మిషన్‌ ఎక్కి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళితే ఎలా ఉంటుంది అనేది చూసి.. మనం కూడా టైమ్‌ మిషన్‌ ఎక్కితే బావుండు, ఆ కాలానికి వెళితే బాగుండు అనుకున్నాం. అదే అనుభూతిని నేను ఈ బయోపిక్స్‌లో నటించడం ద్వారా పొందాను. 1978లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిగా స్టార్ట్‌ అయి.. 1984లో ఎండ్‌ అయి, 1984లో దేవినేని నెహ్రూగా స్టార్ట్‌ అయి.. 1989లో ఎండ్‌ అయి, 1989, 90లో చంద్రబాబులా స్టార్ట్‌ అయి 96 దాకా ట్రావెల్‌ చేయడం నాకు నిజంగా టైమ్‌ మిషన్‌ ఎక్కిన ఫీలింగ్‌ కలిగించింది. ఇలాంటి ఒక టైమ్‌ మిషన్‌ ఎక్కడానికి ఆర్‌జివిగారు పునాది. అందుకు ఆయనకు హృదయపూర్వక దన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here