‘సూర్యకాంతం’ సినిమాలో ప్రతి పాత్రకూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది – రాహుల్ విజయ్

0
420

వరుణ్‌ తేజ్‌ సమర్పణలో నిర్వాణ సినిమాస్‌ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ జంటగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సందీప్‌ ఎర్రంరెడ్డి, సుజన్‌ ఎరబోలు, రామ్‌ నరేష్‌ నిర్మించిన చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా హీరో రాహుల్‌ విజయ్‌తో ఇంటర్వ్యూ..

ఈ అవకాశం ఎలా వచ్చింది?
– నా తొలి సినిమా లాంచ్‌కి వరుణ్‌ అన్నను పిలవడం జరిగింది. ఆ సమయంలో ఆయన ‘అంతరిక్షం’ సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ అప్పటికే కార్యరూపం దాల్చింది. హీరోయిన్‌గా నిహారిక ఫైనల్‌ అయ్యి మేల్‌ లీడ్‌ కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో వరుణ్‌ నన్ను చూసి డైరెక్టర్‌ ప్రణీత్‌కి ఫోన్‌ చేసి నేనొక అబ్బాయిని చూశాను. ఆ క్యారెక్టర్‌ కోసం యాప్ట్‌ అనిపిస్తున్నాడు మీరొక సారి చూడండి అన్నారంట. అప్పుడు ప్రణీత్‌ నన్ను కలిసి ఆడిషన్‌ చేయడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకె అయ్యింది.

‘సూర్యకాంతం’ సినిమా ఎలా ఉంటుంది?
– చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమాలో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ చాలానే ఉండి సినిమా ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా అన్పిస్తుంది. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్‌ చాలా బావుంటాయి. ఎమోషన్‌ అనేది యూనివర్శల్‌ థింగ్‌ కాబట్టి ఈ స్టోరీని మనం ఎలా చూశామన్న దానిబట్టి సినిమా ఉంటుంది.

మీ పాత్ర గురించి?
– ఇందులో నేను అభి అనే పాత్ర చేశాను. కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే పాత్ర. నా నిజ జీవితానికి, ఈ కేరక్టర్‌కి అసలు ఎక్కడా సంబంధం ఉండదు. అందుకే ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా. చాలా అబ్జర్వ్‌ చేశాను. పూజా, కాంతం.. ఈ రెండు పాత్రల మధ్య నలిగిపోయే ఇన్నోసెంట్‌ కుర్రాడి పాత్ర. ఎవరినీ నొప్పించని తత్వం . ఇందులో ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్‌ ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారో చూడాలి.

దర్శకుడి గురించి?
– ఈ సినిమా తర్వాత ప్రణీత్‌ తప్పకుండా చాలా హైట్స్‌ రీచ్‌ అవుతాడు. మామూలుగా మనం ఇతరుల్ని చూసేటప్పుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ గురించి మాట్లాడుతాం. అయితే మంచీ లేకుంటే చెడు ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా ఉండదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌కి మధ్యలో ఇంకో గ్రే షేడ్‌ అనేది ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి గ్రే గురించి ఎక్కువ డిస్కషన్స్‌ ఉంటాయి. దాన్ని చాలా బేలన్స్‌గా చెప్పాడు ప్రణీత్‌.

నిహారికతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌?
– తను చాలా స్ట్రాంగ్‌ ఇండిపెండెంట్‌ విమెన్‌. ఎవరితో ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. అలా లేకుంటే అడ్వాంటేజ్‌ తీసుకునేవారు చాలా మంది ఉంటారు. అలాంటి అంశాలకు తనెక్కడా స్కోప్‌ ఇవ్వదు.

పెర్ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ కేరక్టర్‌ చేయడం ఎలా అనిపించింది?
– పెర్ఫార్మెన్స్‌ చేయడం నాకు ఇష్టమే. ఇప్పటికిప్పుడు యాక్షన్‌ హీరో అయిపోవాలనేం లేదు. 30 ఏళ్ల లోపు వీలైనన్ని ప్రయోగాలు చేయాలని ఉంది. నటుడిగా నా వంతు కృషి నేను తప్పకుండా చేయాలి. అందుకే ఈ సినిమా చేశా. ఇందులో ఫస్టాఫ్‌ ఫన్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువ ఎమోషన్స్‌ ఉంటాయి.

నాన్నగారు మీ స్క్రిప్ట్‌ విషయాల్లో జోక్యం చేసుకుంటారా?
– లేదండీ. ఆయన వింటారు. సలహాలిస్తారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్‌ అందులో నాది ఒక క్రాఫ్ట్‌ మాత్రమే. కానీ ఆర్టిస్ట్‌ అనేవాడు 24 క్రాఫ్ట్‌కి జస్టిస్‌ చేయగలగాలి. అప్పుడే అతను సక్సెస్‌ అవ్వగలడు. అందుకని పాత్రల ఎంపిక విషయంలో, పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు.

ఈ సినిమా నిర్మాతల గురించి చెప్పండి?
– చాలా మంచి ప్రొడక్షన్‌. సెట్లో ఎప్పుడూ చిల్‌గా ఉండేది. ఎక్కడా క్రియేటివ్‌ ఇన్‌ఫ్లుయన్స్‌ చేయాలని చూడలేదు. దర్శకుడికి ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. ఈ బేనర్‌లో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది.

మీ నెక్స్ట్‌ మూవీస్‌ గురించి చెప్పండి?
– నెక్ట్స్‌ తమిళ్‌, తెలుగు ఓ బైలింగ్వుల్‌ సినిమా చేస్తున్నా. కన్నడ సినిమా ‘కాలేజ్‌ కుమారా’కు రీమేక్‌. ఇందులో మా నాన్న పాత్రలో తెలుగులో శ్రీకాంత్‌గారు చేస్తున్నారు. తమిళ్‌లో ప్రభుగారు చేస్తున్నారు. ఏప్రిల్‌ మూడో వారం నుంచి షూటింగ్‌ ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీని తర్వాత మార్షల్‌ కిక్‌ బాక్సింగ్‌ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేస్తా. మణి అని ఓ కొత్తబ్బాయి ఆ స్క్రిప్ట్‌ చెప్పాడు. చాలా బావుంది. దాన్ని అతనే డైరెక్ట్ చేయబోతున్నాడు. తనకి షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉంది. నేను కూడా నాలుగేళ్లు కిక్‌ బాక్సింగ్‌, బ్యాంకాక్‌లో ఆరు నెలలు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. అందుకనే ఆ స్క్రిప్ట్ కి కనెక్ట్ అయ్యాను దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో రాహుల్‌ విజయ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here