సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం చిత్రలహరి. ఈ చిత్రం టీజర్‌ని ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
సుప్రీమ్ హీరో సాయిధర్ తేజ్ మాట్లాడుతూ – ”అడగ్గానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకుని, వాయిస్ ఓవర్ ఇచ్చిన సుకుమార్‌గారికి థాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన సంగీతంతో పాటు, అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. నాలుగు పాటలు చాలా ఉన్నాయి. మంచి సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్, రవి, మోహన్‌గార్లకి థాంక్స్. చాలా సపోర్ట్ చేస్తూ,.. ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమలగారు కథను ఎంత బాగా చెప్పారో… అంత కంటే బాగా సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. కార్తీక్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ‘నువ్వు నేను’ సినిమా చేస్తున్న సమయంలో సునీల్ అన్న కామెడీ టైమింగ్.. కామిక్ సెన్స్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని. నటుడిగా మారిన తర్వాత ఆయనతో ఓ సినిమా అయినా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాలో ఆయన కలిసి పనిచేశాను.. ఆయనతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను” అన్నారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ – ”నేను భీమవరంలో చదువుకుంటున్న రోజుల్లో నేను ఎలా బిహేవ్ చేసేవాడినో.. అలాంటి క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. నేను మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సినిమా ద్వారా ఓ మంచి క్యారెక్టర్ రావడం ఆనందంగా ఉంది. సినిమాతో పాటు వచ్చే ట్రావెల్‌లోనే కామెడీ ఉంటుంది. కథను నమ్మి మైత్రీ సంస్థలో సాయికి ఓ డిఫరెంట్, మంచి సినిమా చేస్తున్నందుకు థాంక్స్. ఈ వేసవిలో సినిమాకు వెళ్లే ప్రేక్షకుడు హ్యాపీగా నవ్వుకుంటూ మంచి ఫీల్‌తో ఇంటికెళతారు. మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. కొత్త కథ. ఆల్ ది బెస్ట్” అన్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ – ”అడగ్గానే టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సుకుమార్‌గారికి క తజ్ఞతలు. అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్, రవి, మోహన్‌గారికి థాంక్స్. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. సంతోషంగా ఉంది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్త్తోంది. మీడియా నుండి కూడా మంచి స్పందన వస్తుంది. సాయిధరమ్‌తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్, సునీల్‌గారు నటించారు. మా ‘చిత్రలహరి’ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. టైటిల్ చెప్పగానే బాగా నచ్చింది. ఒకప్పుడు అందరికీ కనెక్ట్ అయిన టైటిల్. ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను జరిపి ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేస్తాం. బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాం. సాయిధరమ్‌గారికి మళ్లీ ‘సుప్రీమ్’ డేస్ వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం” అన్నారు.
హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – ”కిషోర్‌గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నాను. ఆయన హీరోయిన్ క్యారెక్టర్స్‌ను బ్యూటీఫుల్‌గా నెరేట్ చేశారు. సాయిధరమ్ వండర్‌ఫుల్ కో-స్టార్. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కల్యాణి ప్రియదర్శన్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. సినిమా ఏప్రిల్ 12న విడుదలవుతుంది. సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నాం” అన్నారు.
సాయిధరమ్‌తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎం), దర్శకత్వం: కిషోర్ తిరుమల.
http://industryhit.com/t/2019/03/chitralahari-teaser-launch-pics/