వై.ఎస్‌.ఆర్‌ లాంటి గొప్ప వ్యక్తి ఇతివృత్తంతోవస్తున్న ‘యాత్ర’ పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు

0
172

వైఎస్‌ఆర్‌ చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించారు. శివమేక సమర్పణలో 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా మరియు శశిదేవి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో…

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – ”యాత్ర ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషనల్‌ అయిందో తెలుగు ప్రేక్షకుల్లో అందరికీ తెలుసు. దాన్ని ఐడియాగా తీసుకుని పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్‌, మూమెంట్స్‌ని తీసుకుని మహి కథ రాశారు. దాన్ని విజయ్‌ నిర్మించారు మమ్మట్టిగారి లాంటి లెజండరీ యాక్టర్‌ యాక్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్‌ విడుదలైనప్పుడు, పాటలు విడుదలైనప్పుడు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జయిట్‌మెంట్‌ కనిపించింది. ఆల్‌దిబెస్ట్‌ టు ద టీమ్‌… మంచి సినిమా రాబోతోందని అనిపిస్తుంది. ఇంకా రెండు రోజులు ఉండగానే ఓవర్సీస్‌లోగానీ, ఏపీ, తెలంగాణలోనూ ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ బావున్నాయి. వెరీ స్ట్రాంగ్‌ ఓపెనింగ్‌ తీసుకోబోతుంది సినిమా. ఇవాళ ఓపెనింగ్‌ తీసుకుంటేనే ఆ సినిమాకు ఒక రెవెన్యూ మేజిక్‌ జరుగుతుంది. ఓపెనింగ్‌ అనేది ఇప్పట్లో మరింత ఇంపార్టెంట్‌ అయింది. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అని అంటే మెల్లిగా ఇంప్రూవ్‌మెంట్‌ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఓపెనింగ్‌ తీసుకుంటేనే సినిమా నిలబడే పరిస్థితి ఉంది. ఈ సినిమాను నైజామ్‌, వైజాగ్‌లో మా సంస్థ విడుదల చేస్తోంది. అందువల్ల రాజశేఖర్‌రెడ్డిగారి పాదయాత్రలో జరిగిన మూవ్‌మెంట్స్‌ ఆ రోజుల్లో పేపర్లో, టీవీల్లో చూడటమే. ఆ తర్వాత రాజశేఖర్‌గారు హీరో అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫార్మ్‌ అయింది. జనాల కోసం ఏదైనా చేస్తాడు ఓ నాయకుడు అని రాజశేఖర్‌రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుని చూపించారు. రామారావుగారి తర్వాత మన రాష్ట్రాల్లో ఒక ఇమేజ్‌ బిల్డ్‌ అయింది రాజశేఖర్‌రెడ్డిగారికి. అలాంటి గొప్ప వ్యక్తి ఇతివ త్తంతో వస్తున్న ‘యాత్ర’ పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత విజయ్‌ చిల్లా మాట్లాడుతూ – ”లాస్ట్‌ ఒకటిన్నర ఏళ్లుగా ఈ సినిమా మీద పనిచేస్తున్నాం. ఫిబ్రవరి 8న సినిమా విడుదల కానుంది. మేం చేయాల్సిందంతా చేశాం. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రాజశేఖర్‌రెడ్డిగారి పొలిటికల్‌ జీవితానికి సంబంధించింది కాదు. ఇది పొలిటికల్‌ చిత్రం కాదు. ఇందులో కాంట్రవర్సీలు లేవు. రాజశేఖర్‌రెడ్డిగారి వ్యక్తిత్వం, స్ఫూర్తికి సంబంధించింది. సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. ఇది రాజశేఖర్‌రెడ్డిగారి ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు. ఏ సినిమా లవర్‌ అయినా సినిమాను ఆస్వాదించేలా తెరకెక్కించాం” అన్నారు.

దర్శకుడు మహి వి రాఘవ్‌ మాట్లాడుతూ – ”మనకి అభిప్రాయభేదాలు ఉండవచ్చు. ఎవరి ఆలోచనలు వారివై ఉండవచ్చు. అంతమాత్రాన ఎవరినీ అగౌరవపరచకూడదు. వైయస్సార్‌ సినిమా చేస్తున్నాం. ఈ విషయం అందరికీ ఇష్టం ఉండొచ్చు.. లేకపోవచ్చు. అంత మాత్రాన దయచేసి అగౌరవపరచవద్దు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం చూడటానికి ప్రేక్షకులు ఎంత క్యూరియస్‌గా ఉన్నారో, నేను కూడా అంతే ఆత్రుతగా వెయిట్‌ చేస్తున్నా” అన్నారు.

????????????????????????????????????

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here