అనిల్ ఎఫ్ 2 స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనిపించింది – సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్ రాజు

0
77

‘దిల్‌’, ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారు లోకం’, ‘బృందావనం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శతమానం భవతి’, ‘ఫిదా’… ఇలా.. ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై భారీ హిట్స్‌ సాధిస్తున్న టేస్ట్‌ఫుల్‌ ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు. రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ రేర్‌ కాంబినేషన్‌లో వరుస సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌2’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ కలెక్షన్స్‌ సాధిస్తూ.. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ దాటి బొమ్మ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దిల్‌రాజుతో ఇంటర్వ్యూ.

‘ఎఫ్‌2’తో ఈ సంక్రాంతికి భారీ హిట్‌ అందుకోవడం ఎలా అనిపిస్తోంది?
– 2019 సంక్రాంతి మా బ్యానర్‌కి మంచి బూస్టప్‌ ఇచ్చింది. 2017 లో ఎలాగైతే ఆరు సినిమాలు ఒకే బ్యానర్‌ నుండి వచ్చి సక్సెస్‌ అయ్యాయో, అదే మ్యాజిక్‌ ‘ఎఫ్‌2’ ద్వారా రిపీట్‌ అవుతుంది అని ఆశిస్తున్నాను. ‘ఎఫ్‌2′ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుంది అని అనిల్‌ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడే అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా’ఎఫ్‌2’ కి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ‘ఎఫ్‌2’ ద్వారా మా బ్యానర్‌ను మంచి పొజిషన్‌లో ఉంచిన ప్రేక్షకులకు, అలాగే దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ అందరికీ ఈ సందర్భంగా నేను థాంక్స్‌ చెబుతున్నాను.

‘ఎఫ్‌2’ సినిమా సక్సెస్‌ను ముందే ఊహించారా?
– సినిమా విజయవంతం అయ్యి అద్భుతం సృష్టిస్తుంది అని విడుదలకి ముందే ఎవరూ చెప్పలేరు. మొదటి రోజు, మొదటి వారం కలెక్షన్లు చూస్తున్నప్పుడు ఒక అంచనా వస్తుంది.

‘ఎఫ్‌3’ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది?
– 2021 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం. ఇదే టీంతో కంటిన్యూ అవుతాం.

‘ఎఫ్‌3’ అంటే ముగ్గురు హీరోలు ఉండాలి కదా?
‘ఎఫ్‌3’ స్క్రిప్ట్‌ ప్రకారం ముగ్గురు హీరోలు ఉంటారు. అయితే ఇంకో హీరో యాడ్‌ కావాల్సి ఉంటుంది. మొదట అనిల్‌ స్క్రిప్ట్‌ పూర్తి చేసిన తరువాత దాని గురించి ఆలోచిస్తాం.

2017లో ఆరు సినిమాలు విడుదల చేసి సిక్సర్‌ కొట్టారు కదా! 2019లో రిపీట్‌ చేసే అవకాశం ఉందా?
– 2017లో కూడా ఆరు సినిమాలు రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టాలని నేను అనుకోలేదు. మూడు సినిమాలు చేశాక ఒక క్లారిటీ వచ్చింది. మరో మూడు సినిమాల స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు విడుదల చేసి హిట్‌ కొట్టడం జరిగింది. ప్రస్తుతం నాలుగైదు కాన్సెప్ట్‌లు రెడీగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఒక క్లారిటి వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాను.

‘మహర్షి’ సినిమా షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది?
– విదేశాల్లో షూటింగ్‌ పూర్తయ్యింది. ఫిబ్రవరి 2 నుండి హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి మార్చిలో పూర్తి చేస్తాం. ఏప్రిల్‌ 25న సినిమా విడుదల చేస్తాం.

ఇటీవల తమిళ్‌లో రిలీజై సూపర్‌హిట్‌ అయిన ’96’ సిినిమా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు కదా! దాని గురించి?
– 15 సంవత్సరాల కాలంలో నేను ఇంతవరకూ ఏ సినిమాను రీమేక్‌ చేయలేదు. కాని ’96’ సినిమాను తమిళ్‌లో చూడడం జరిగింది. ఆ రెండు పాత్రల మధ్య ఫీల్‌ను డైరెక్టర్‌ ట్రావెల్‌ చేయించిన విదానం నాకు చాలా బాగా నచ్చి ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. తమిళ్‌ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌ కుమార్‌తోనే శర్వానంద్‌, సమంత హీరోహీరోయిన్లుగా ఈ సినిమాను తెలుగులో వైజాగ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా తెలుగులో తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది.

ఒక ప్రొడ్యూసర్‌గా సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ని ఎలా పరిగణిస్తారు?
– ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఎలాగైతే ప్రతి సంవత్సరం ఒకే రకమైన పంట రాదో.. అలానే సినిమాలు కూడా అంతే. జయాపజయాలు రెండింటినీ సమానంగా స్వీకరిస్తా.

‘ఎఫ్‌3’కి బేసిక్‌ ఐడియా ఏంటి?
‘ఎఫ్‌2’ షూటింగ్‌ చేసేటప్పుడే అనిల్‌ ‘ఎఫ్‌3’ ఐడియా గురించి చెప్పడం జరిగింది. కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక చూద్దాం అన్నాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నప్పుడు ఫిక్స్‌ అయ్యి వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది.

‘ఎఫ్‌2’ సక్సెస్‌లో మీ ఇన్వాల్‌మెంట్‌?
‘ఎఫ్‌2’ పూర్తిగా అనిల్‌ బ్రాండ్‌ సినిమా. నేను అన్ని విషయాలలో బ్యాకప్‌గా ఉన్నాను.

‘ఎఫ్‌2’ రీమేక్‌ చేసే ఆలోచన ఉందా?
– ప్రస్తుతానికి తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలో చెప్తాను.

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
– ‘పలుకే బంగారామాయె’ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నాం. నాగచైతన్యతో ఒక సినిమా ఉంది. దానికి స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతోంది. రాజ్‌తరుణ్‌తో మరో సినిమా ఉంది. ఇంకా రెండు, మూడు సినిమాలకు స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here