సంక్రాంతి పండుగకు అందరూ ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్టైనర్ ‘F2’ – విక్టరీ వెంకటేష్

0
493

దృశ్యం,గురులాంటి సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత విక్టరి వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్-లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన మల్టిస్టారర్‌ ‘ఎఫ్‌ 2’ ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ ట్యాగ్‌ లైన్‌. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఫుల్‌ లెంగ్త్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ కామిడి ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ అవుతుంది.ఈ సందర్బంగా ‘విక్టరి వెంకటేష్‌’తో ఇంటర్వ్యూ.

మద్యకాలంలో ఎక్కువగా వైవిద్యమైన స్క్రిప్ట్‌లకే ప్రాదాన్యమిస్తున్నారు?
– ‘గురు’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆ తర్వాత చాలా స్క్రిప్ట్‌ లు విన్నాను. కానీ కుదరలేదు. ఈ స్క్రిప్ట్‌ బాగా నచ్చింది. స్టోరీ నా స్టయిల్‌లో ఉంటూనే కొత్తగా ఉంది. యువకుడితో కలిసి పనిచేయడంలో ఒకరకమైన ఆనందం ఉంటుంది. వారి నుంచి మనం నేర్చుకోవచ్చు. మన నుంచి వారు తెలుసుకుంటారు. అందులోనూ ఈ సినిమాలో నేనూ, వరుణ్‌ తోడళ్లుళ్లుగా నటించాం. బిఫోర్‌ మేరేజ్‌, ఆఫ్టర్‌ మేరేజ్‌ వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి.

ఎఫ్‌2 ఫన్నీగానే ఉంటుందా.. లేకుంటే ఏమైనా సందేశాత్మకంగా కూడా ఉంటుందా?
– పెళ్లి గురించి, భార్యల గురించి మనం ఎంత సరదాగా మాట్లాడుకున్నా, ఆడవాళ్లు లేనిదే స ష్టిలేదు. ఆడవాళ్ల గొప్పదనాన్ని మనం గుర్తించాలి. అప్పుడే ఆ సృష్టి సజావుగా ముందుకు సాగుతుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత సంక్రాంతికి అదే బ్యానర్‌లో రావడం ఎలా అనిపిస్తుంది?
-2013లో దిల్‌ రాజు గారి బ్యానర్‌లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతి కి విడుదలై సూపర్‌హిట్‌ సాదించింది. మళ్లీ 2019 లో అదే బ్యానర్‌లో శిరీష్-లక్ష్మణ్ నిర్మాతలుగా ‘ఎఫ్‌2’ తో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది ‘ఎఫ్‌2’ పక్కా ఫ్యామిలీ సినిమా. గత నాలుగైదేళ్లగా సినిమాలు బావుంటే ఫ్యామిలీలు థియేటర్లకు రావడాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో నాకు తెలియకుండానే, నా మేనరిజమ్స్‌ పరంగా ఎన్నో ఇంప్రూవైజ్‌లు జరిగిపోయాయి. సినిమాలో, ఆ పాత్రలో లీనమైనప్పుడే అలాంటివన్నీ జరుగుతాయి.

దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి చెప్పండి?
– అనిల్‌ చాలా మంచి కుర్రాడు. చాలా కామ్‌ అండ్‌ పాజిటీవ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. స్వయంగా రైటర్‌ కావడంతో ఎక్కడైనా, ఏదైనా డైలాగ్‌ కావాలనిపించినా వెంటనే రాసుకునేవాడు. నా గత చిత్రాలన్నిటినీ స్టడీ చేసి నా క్యారెక్టర్‌ డిజైన్‌ చేశాడు అనిపించింది.

ఎఫ్‌2లో వరుణ్‌తేజ్‌తో కలసి నటించడం ఎలా అనిపించింది?
– చాలా తక్కువ కాలంలోనే బాగా కలిసిపోయాడు. వరుణ్‌ ఇమేజ్‌ అనే చట్రంలో ఇరుక్కోకుండా తనదైన శైలితో మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ యాసలో స్పష్టంగా మాట్లాడాడు. తన పర్సనాలిటీ కూడా చాలా బావుంటుంది. కామిడి టైమింగ్‌లో చాలా బాగా చేశాడు. తనకీ, మెహ్రీన్‌కి మధ్య సన్నివేశాలు కూడా బావుంటాయి.

ఇంకా చేయాలనుకుంటున్నా పాత్రలున్నాయా?
– ఎప్పుడూ ఫలానా అని కోరుకోను. అయినా నాలోని నటనను పూర్తి స్థాయిలో చూపించదగ్గ పాత్రల కోసం వెయిట్‌ చేస్తున్నా. నాకు ఏం ఇవ్వాలో ప్రకృతికి తెలుసు. నాకు కావలిసినన్ని పాత్రలు వస్తూనే ఉంటాయి. వాటిలో నుంచి నాకు నచ్చినవి నేను సెలక్ట్‌ చేసుకోవడమే. నాకూ అమీర్‌ఖాన్‌ చేసే సినిమాలు, అమితాబ్‌ తరహా వైవిధ్యమైన చిత్రాలు చేయాలని ఉంటుంది. అంతెందుకు ‘బాహుబలి ‘లాంటి సినిమాలు చేయాలని కూడా ఉంటుంది.

ఈ సినిమాలో మీ పాత్రకు వెంకీ అనే పేరు పెడితే ముందు వద్దన్నారట?
– అలాగనేం కాదు. ఆ మధ్య కూడా ఓ సినిమాలో నా పాత్రకు వెంకీ అనే పేరు పెట్టారు. వరుసగా వెంకీ పేరు ఎక్కువగా వినిపిస్తోందని వద్దన్నాను. ఈ సినిమాలో వచ్చే వెంకీ ఆసనం కూడా స్క్రిప్ట్‌ ఇంప్రువైజ్‌లో భాగంగా అనిల్‌కి వచ్చిన ఐడియా. నాకు బాగా నచ్చడంతో అదే పేరుతో కంటిన్యూఅయ్యాము.

బాగా ఫిట్‌గా కనిపిస్తున్నారు సీక్రెట్‌ ఎంటి?
– ప్రతిరోజూ జీవితాన్ని ఆస్వాదిస్తా. క్రమశిక్షణతో ఉంటా. అంతకు మించి మరేమీ లేదు. బాహ్య ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోను. సూర్యోదయాన్ని చూస్తా. పక్షులను గమనిస్తా. పక్కవాళ్లు బావుండాలని కోరుకుంటా. అదే నా సీక్రెట్‌.

ఇమేజ్‌ గురించి ఆలోచిస్తుంటారా?
– నాకు ఎప్పుడూ ఇమేజ్‌ అనేది అర్థం కాదు. నాకు సినిమా అనేది వ్యాపారం మాత్రమే. ఇమేజ్‌ అనేది నేను ఆలోచిస్తేనో, నేను అనుకుంటేనో వచ్చేది కాదు. అంతకు మించింది, ప్రజలు ఇవ్వాల్సింది. కాబట్టి నేను దాని గురించి ఆలోచించను. నాతో సినిమాలు తీసిన నిర్మాత బావుండాలి. పంపిణీదారులు బావుండాలనే అనుకుంటా. అంతకుమించి కంట్రోల్‌ చేయాలని అనుకోను.

మీతో పోలిస్తే ఇప్పుడొస్తున్న యంగ్‌స్టర్స్‌కి ఎక్కువ సౌకర్యాలు ఉన్నట్టున్నాయి?
– ప్రపంచంలో అందరికీ సౌకర్యాలు పెరుగుతూనే ఉన్నయిగా.. పాపం వీళ్లకి ఉండకూడదా? ఉండాలి. ఎప్పుడూ మన పక్కనున్న వాళ్లు బావుండాలి. అలా వాళ్లుబావుంటే మనం కూడా బావుంటాం. ఆ విషయాన్ని నమ్ముతా.

సోషల్‌ మీడియాలో ఈ మధ్య ఎంటర్‌ అయ్యారు?
– మిగిలిన వేదికలతో పోలిస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌ చాలా బావుందనిపించింది. నేను వ్యక్తిగతంగా ఫొటోగ్రఫీని ఇష్టపడతా. ప్రక తిని తీసిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటా. మిగిలిన వేదికలను నేను అంత తేలిగ్గా మేనేజ్‌ చేయలేనేమోనని అనిపిస్తుంది.అంతేకాదు ఫోర్స్‌ ఫుల్‌గా ఏం చేసినా, అది నాకు ఒత్తిడిని కలిగిస్తుంది.

నెక్స్ట్‌ చేస్తున్న సినిమాలేంటి?
– ‘వెంకీమామ’ లోనాగచైతన్యతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాకు స్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. అనిల్‌ మరలా ఇంకో స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. ఏది ముందవుతుందో చూడాలి. ‘వెంకీమామ’లో చాలా మంచి రోల్‌ చేస్తున్నా. నా రోల్‌ ఎంత బావుంటుందో, చైతూ పాత్ర కూడా అంతే బావుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here