‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’లో స్మార్ట్, 3డీ సినిమాలు..!

0
346

మూవీ ల‌వ‌ర్స్‌కు బోలెడంతా ఎంట‌ర్‌టైన్మెంట్ ఇవ్వ‌డానికి వ‌చ్చేసింది ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’. కేవ‌లం గంట నిడివిగ‌ల సినిమానే ‘స్మార్ట్ సినిమా’గా పిలుస్తూ, త్రీడీ సినిమాలను కూడా ఆన్‌లైన్‌లోనే చూపిస్తూ కొత్త కాన్సెప్టుతో స‌రికొత్త సినీ ఇండ‌స్ట్రీకి తెర‌లేపుతోంది ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్’. వారంకు ఓ స్మార్ట్ సినిమాను విడుద‌ల చేస్తూ, వెబ్‌సిరీస్‌లు, గేమ్‌షోలు, రియాల్టీ షోలతో నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఇస్తోంది ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్’.

డిజిట‌ల్ మూవీ ప్లాట్ ఫామ్‌గా వ‌చ్చిన ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’లో త్రీడీ సినిమాలు కూడా చూడొచ్చు. త్రీడీ ఆప్ష‌న్ గ‌ల స్మార్ట్ టీవీల్లో స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్ డాట్ కం ఓపెన్ చేసి త్రీడీ సినిమాల కేటగిరికి వెళ్లి న‌చ్చిన మూవీ సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌పై సినిమాల‌తో పాటు ఆన్‌లైన్ షాపింగ్ కూడా ఉంటుంది. ఫుడ్ డెలివ‌రీ కూడా అందుబాటులో ఉంటుంది అందుకే ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’గా పిలువ‌బ‌డుతోంది. ఇందులో విడుదలయ్యే సినిమాలను ప్రేక్షకుడు స్మార్ట్ ఫోన్‌, స్మార్ట్ టీవీ, హోమ్ స్క్రీన్ థియేట‌ర్‌, డెస్క్‌టాప్‌ల‌లో చూడవచ్చు. భారీ నిడివి లేకుండా 60 నుంచి 90 నిమిషాల నిడివితో తీసిన సినిమాలను ‘స్మార్ట్ సినిమా’లు పిలుచుకుంటూ వాటిని విడుదల చేస్తుంది ఈ డిజిట‌ల్ వేదిక‌.

లోక‌ల్ కంటెంట్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ.. ఇటు ప్రేక్ష‌కుడిని, అటు స్మాల్ బడ్జెట్ మూవీ మేక‌ర్‌ని smartmultiplex.com ఆక‌ర్షిస్తోంది. ఇందులో స్మార్ట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు, స్మార్ట్ ఫిల్మ్ లు కూడా ఉంటాయి. ప్రేక్ష‌కుడికి రిజిస్ట్రేష‌న్‌తో పాటు స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న మొట్ట‌మొద‌టి మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here