వ‌ల్ల‌భ‌నేని అశోక్ స‌మ‌ర్ప‌ణ‌లో పేట తెలుగు వ‌ర్ష‌న్.. జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌..

0
245

ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని పేట తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈయన గతంలో విజయ్ సర్కార్.. మణిరత్నం నవాబ్ సినిమా హక్కులను తెలుగులో తీసుకున్నారు. ఇప్పుడు పేట హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారీ పోటీ మధ్య ఈ డీల్ సొంతం చేసుకున్నారు అశోక్. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు ఈ నిర్మాత‌. తెలుగులో ఈ చిత్రాన్ని భారీగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత అశోక్. పేట సినిమా ర‌జినీకాంత్, కార్తిక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్ లో వ‌స్తుంది. సూపర్ స్టార్ కు తెలుగులో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాకు హెల్ప్ కానుంది. రజిని ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు. ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఇందులో కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పేట సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తుండగా.. సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. జనవరి 10న విడుదల కానుంది పేట.

న‌టీన‌టులు:
సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్..

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: కార్తిక్ సుబ్బ‌రాజ్
నిర్మాత‌: వ‌ల్ల‌భ‌నేని అశోక్
నిర్మాణ సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్
డిఓపి: ఎస్ తిర‌ణ‌వుక్క‌రుసు
సంగీతం: అనిరుధ్ ర‌విచంద‌ర్
ఎడిట‌ర్: వివేక్ హ‌ర్ష‌న్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సురేష్ సెల్వ‌రాజ‌న్
యాక్ష‌న్ డైరెక్ట‌ర్: పీట‌ర్ హెయిన్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: నిహారిక భాసిన్ ఖాన్, ప్ర‌వీణ్ రాజా
కొరియోగ్ర‌ఫీ: ష‌రీఫ్, బాబా భాస్క‌ర్

http://industryhit.com/t/2018/12/superstar-rajinikanths-peta-on-jan-10-posters/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here