`అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` ఇంటెన్స్ ఎంట‌ర్‌టైనర్ – మాస్ మ‌హారాజా ర‌వితేజ

0
324

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా సూప‌ర్ డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, రంగ‌స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మించిన బారీ బడ్జెట్ చిత్రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`. నవంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో ఇంట‌ర్వ్యూ…

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం చేయ‌డానికి కారణం?
– నేను ఏ సినిమా చేసినా.. ఫస్ట్‌ నాకు కథ నచ్చితేనే చేస్తాను. శ్రీను వైట్ల నాకు ఈ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ స్టోరీ చెప్పినపుడే నాకు స్టోరీ బాగా నచ్చింది. కథకు సంబంధించి కొన్ని సందేహాలుంటే శ్రీనుని అడిగాను. త‌ను ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌ను చేయడం చాలా కొత్త‌గా, ఛాలెంజిగ్‌గా అనిపించింది. నాకైనా, శ్రీనుకైనా ఇలాంటి స్క్రిప్ట్‌లో వ‌ర్క్ చేయ‌డం కొత్తే.

అమర్‌, అక్బర్‌, ఆంటోనీ లో మీకు నచ్చిన పాత్ర ఏది?
– నాకు పర్సనల్‌ గా అమర్‌ క్యారెక్టర్‌ అంటే ఇష్టం ఆ పాత్రలో ఇంటెన్సిటీ, ఎమోషన్స్ ఉంటాయి. అలాగే అక్బర్‌,ఆంటోనీ పాత్రల నుంచి కామెడీ బాగా జనరేట్‌ అవుతుంది. మూడు పాత్రలు దేనికదే మెప్పించేలా శ్రీను చాలా బాగా డిజైన్ చేశాడు.

మూడు పాత్ర‌ల కోసం ఏమైనా హోం వ‌ర్క్ చేశారా?
– లేదండి.. డైరెక్ట్‌గా సెట్స్‌లో వ‌ర్క్ చేయ‌డ‌మే. ఇలా మూడు పాత్ర‌ల్లో న‌టించ‌డం వ‌ల్ల న‌టుడిగా నేను చాలా సంత ప్తి గా ఉన్నాను.

శ్రీను వైట్లతో మీ నాలుగో చిత్రం కదా…?
– అవునండి.. శీనుతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌. తనలో ఏమాత్రం హ్యూమర్‌ తగ్గలేదు. త‌న డైరెక్ష‌న్‌లో చేసిన `నీకోసం` ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ అయితే.. త‌ర్వాత చేసిన వెంకీ, దుబాయ్‌శీను చిత్రాలు ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ఇన్‌టెన్సిటీతో పాటు ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంటుంది. శ్రీనులో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. త‌ను అంద‌రికీ న‌టించి వివ‌రిస్తాడు. అందుకే అతను డిజైన్‌ చేసే ప్రతి పాత్రలోనూ తను కనిపిస్తాడని ఈ మ‌ధ్య చెప్పాను.

సునీల్‌, వెన్నెల‌కిషోర్‌, స‌త్య కామెడీ పార్ట్ ఎలా అల‌రిస్తుంది?
– సునీల్ దుబాయ్ శీనులో చూసిన‌ట్లు అలాగే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. ఇక స‌త్య పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉంటుంది. వెన్నెల‌కిషోర్ త‌న స్టైల్ ఆఫ్ కామెడీతో న‌వ్విస్తాడు.

ఇలియానా గురించి..?
– ఇలియానాతో మ‌ధ్య‌లోనే సినిమా చేసుండాల్సింది కానీ కుద‌ర‌లేదు. ఈ సినిమాకు కుదిరింద‌ది. ఈ సినిమాలో ఆ పాత్రకు ఆ అమ్మాయే కరెక్ట్ అని ఆమె పాత్ర గురుంచి అనుకున్నప్పుడే నేను శీను ఫీల‌య్యాం. ఇలియానా మంచి పెర్ఫామ‌ర్‌, వర్కర్‌ కూడా. తను కళ్ళతోనే ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వగలదు. ఈ సినిమాలో డబ్బింగ్‌ కూడా ఆమె చెప్పుకుంది.

సినిమా హిట్‌ ప్లాప్‌ ల గురుంచి ఆలోచిస్తారా..?
– హిట్‌లు ఇచ్చే వాళ్ళు ప్లాప్‌లు ఇవ్వొచ్చు.. బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చేవాళ్ళు డిజాస్టర్‌ లు ఇవ్వొచ్చు.. ఒకొక్కసారి స్టోరీ ఎంపికలో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించే ఆలోచించుకుంటూ ఉండిపోతే ఎలా.. కాబ‌ట్టి పెద్ద‌గా జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోను. నెక్స్‌ట్ ఏంట‌ని ఆలోచిస్తాను.

స్వంత నిర్మాన సంస్థ పెడుతున్నారు.
– ఎందుకండీ.. అవన్నీ.. మనకు తెలియని వాటి జోలికి వెళ్లడం ఎందుకు..నాకు ఇదే వచ్చు.. ఇలానే హ్యాపీగా ఉన్నా.. ఒక వేళ అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా ముందు చెబుతా.. నేను స్వయంగా చెప్పేదాకా మీరు నమ్మొద్దు..

కెరీర్‌ లో ఇలాంటి క్యారెక్టర్‌ చేయాలి అని ఏమైనా కోరిక ఉందా?
– నాకు అలాంటిది ఏమీ లేదు.. అన్నీ పాత్రలు చేస్తా.. కాకపోతే సెట్‌ అవ్వాలి అంతే..

మీతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన థమన్‌ 100 సినిమాలు పూర్తి చేశారు కదా .. ఎలా అనిపిస్తోంది..?
– అవును.. థమన్‌ ఎప్పుడు వంద సినిమాలు చేసాడో తెలియదు.. అలా చేసుకుంటూ పోయాడంతే.. మధ్యలో చిన్న గ్యాప్‌ వచ్చినా… తరువాత దూసుకెళ్తున్నాడు. త‌ను మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్.ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అదరగొట్టాడు.

అరవిందస్వామి,మాధవన్‌లా నెగటివ్‌ రోల్స్‌ చేసే అవకాశం ఉందా?
– నాకు అయితే నెగిటివ్‌ రోల్స్‌ చేయకూడదు లాంటి ఆలోచనలు అయితే లేవు. ఫ్యూచర్‌ లో ఖచ్చితంగా నెగిటివ్‌ రోల్స్‌ తో పాటు అన్ని రకాల పాత్రలు చేస్తాను. కానీ నేను ఏం చేసినా నా పాత్ర చాలా బలంగా ఉండాలని కోరుకుంటాను.

మీ వర్క్‌ విషయంలో మిమ్మల్ని విమర్శించే బెస్ట్‌ క్రిటిక్‌ ఎవరు ?
– నాకు క్లోజ్‌గా ఉన్న వాళ్ళందరూ అలానే ఓపెన్‌గానే ఉంటారు.. ఎందుకంటే నేనుకూడా అలానే ఉంటాను కాబట్టి.. ముఖ్యంగా నా కొడుకే (మహాధన్‌) నా క్రిటిక్‌. వాడికి ఏదయినా నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తాడు..

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌..?
– ఎస్‌.ఆర్‌.టి ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్‌ లో వి.ఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ లో సంతోష్‌ శ్రీనివాస్‌తో సినిమా ఉంది. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేసే సినిమా ‘తేరి` రీమేక్ కాదు. కొత్త క‌థ‌తో ముందుకెళ్ల‌బోతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here