మా సినిమా ని చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు -‘అదుగో’ ప్రెస్ మీట్ లో రవిబాబు..!!

0
21

పంది పిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు ర‌విబాబు తెర‌కెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం ‘అదుగో’.. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్,నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్ర‌శాంతి విహారి స్వ‌రాలు అందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ లో చూపిస్తుండడం విశేషం.. కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో పాదయాత్ర నిర్వహించి అందరి దృష్టి ని సినిమా వైపు మళ్లించుకునేలా చేసాడు.. చిత్ర యూనిట్ తో నేడు కేబీఆర్ పార్క్ వద్దనుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు పంది పిల్లతో కలిసి పాదయాత్ర చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.. గతంలోనూ ఈ పంది పిల్ల తో పలు రకాల ప్రమోషన్ వీడియోస్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలుగగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. కాగా ఈ చిత్రం యొక్క పాత్రికేయుల సమావేశం ఈరోజు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరగగా ఈ కార్యక్రమానికి చిత్రం యూనిట్ తో పాటు నిర్మాత సురేష్ బాబు హాజరయ్యారు..

ఈ సందర్భంగా హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి చాల థాంక్స్.. రవిబాబు గారితో సినిమా చేయడం ఎంబీఏ చేసినంత గ్రేట్ హానర్.. అయన తో పనిచేయడం చాల గొప్ప విషయం.. సినిమా చాల బాగుంటుంది.. అన్ని వయసుల వారిని తప్పక ఆకట్టుకుంటుంది.. దీపావళి కి వస్తున్న మా సినిమా ని తప్పక ఆదరించండి అన్నారు..

నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. రవిబాబు సినిమా కి ప్రమోషన్స్ చాల వెరైటీ గా చేస్తుంటాడు.. సినిమా కూడా ఆడియెన్స్ కి విపరీతంగా నచ్చుతుందని అనుకుంటున్నాను.. నా ఫస్ట్ సినిమా నచ్చావులే నా 101 వ సినిమా అదుగో.. ఆ సినిమా లాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి.. దీపావళి రోజున వస్తున్న ఈ సినిమా ని అందరు ఆదరించాలి అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా కి సహకరించిన అందరికి చాల థాంక్స్.. ఈ సినిమా తోనే చాల మంది కెరీర్లు మొదలవబోతున్నాయి.. వారికి అల్ ది బెస్ట్.. దీపావళి రోజు రిలీజ్ కావడానికి కారణం ఆరోజు సినిమా తప్పకుండ చూస్తారని ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు..

దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాల థాంక్స్.. ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేసానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది.. కానీ మా సినిమా కి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరు లేరు.. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు.. ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం.. ఈ పాదయాత్ర కు మరో ముఖ్య కారణం ఏంటంటే ఈ దీపావళి కి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి.. దానివల్ల వన్ మంత్ వరకు క్వాలిటీ ఎయిర్ మనకు అందట్లేదు.. ఇప్పటికే చాల జబ్బులతో బాధపడుతున్న మనకు ఇంకా కొత్తవి రాకుండా ఈ వాతావరణాన్ని కాపాడే బాధ్యత మనది.. ఈ సినిమా ని తప్పక చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు… అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here