శుక్రా ప్రొడక్షన్స్‌ నెం.3 కొత్త చిత్రం ప్రారంభం

0
61

మిషాల్‌ శైలేష్‌ జైన్‌, హేమలత హీరో హీరోయిన్లుగా శుక్రా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.3 చిత్రం బుధవారం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లో ప్రారంభమైంది. వి.ఎస్‌.ఫణీంద్ర దర్శకత్వంలో సంజీవ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి సత్యప్రకాశ్‌ క్లాప్‌ కొట్టగా.. నిర్మాత సంజీవ్‌ కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా…

సత్యప్రకాశ్‌ మాట్లాడుతూ – ”దర్శక నిర్మాతలకు, హీరో హీరోయిన్‌కు అభినందనలు. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ – ”ఓ మంచి టీమ్‌ కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నాను. యంగ్‌ టాలెంటెడ్‌ టీం కుదిరింది. డిఫరెంట్‌ సినిమా చేయాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఫణీంద్రగారు కలిశారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాను. హీరో మిషాల్‌ జైన్‌ తొలి సినిమా. షార్ట్‌ ఫిలింస్‌లో చూసి తనకు మా సినిమాలో అవకాశం ఇచ్చాను. హేమలత మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమె నటిస్తున్న రెండో చిత్రమిది. సత్యప్రకాశ్‌ వంటి సీనియర్‌ యాక్టర్‌ మా సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది” అన్నారు.

దర్శకుడు వి.ఎస్‌.ఫణీంద్ర మాట్లాడుతూ – ”మంచి కథ, టీమ్‌తో చేస్తున్న సినిమా ఇది.సత్యప్రకాశ్‌గారు చాలా మంచి పాత్ర చేశారు. ఆయన్ను కొత్త కోణంలో చూస్తారు. సినిమాలో నాలుగు సాంగ్స్‌ ఉన్నాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్ష మంచి సంగీతం అందించారు. ఒకరికొకరు అనే ప్రేమలో ఒకరు పొతే మరొకరు అనే దోరణి వచ్చింది. ఇలా ఎందుకు? అని ఆలోచించుకుని రాసుకన్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ మూవీ ఇది. మిషాల్‌, హీరోయిన్‌ హేమలత సహా టీమ్‌కు థాంక్స్‌” అన్నారు.

మిషాల్‌ శైలేష్‌ జైన్‌ మాట్లాడుతూ – ”నా తొలి చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ హేమలత మాట్లాడుతూ – ”ఇది నా రెండో చిత్రం. డైరెక్టర్‌గారు చెప్పిన కథ బాగా నచ్చింది. మంచి నిర్మాత కూడా మాకు సహకారం అందిస్తున్నారు. చాలా మంచి టీం కుదిరింది. మిషాల్‌ నాకు బాగా తెలుసు. దర్శక నిర్మాత సహా అందరికీ థాంక్స్‌” అన్నారు.

మిషాల్‌ శైలేష్‌ జైన్‌, హేమలత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్ష ప్రవీణ్‌, కెమెరా: అలీ, ఎడిటర్‌: రామారావు, నిర్మాత: సంజీవ్‌ కుమార్‌, దర్శకత్వం: వి.ఎస్‌.ఫణీంద్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here