ఒక హీరోయిన్ తండ్రీ, తనయులకి జంటగా నటించడం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఒక హీరో కి జంటగా తల్లీ, కూతుళ్ళు నటించడం చాలా అరుదైన విషయం. నటరత్న ఎన్.టీ.ఆర్ గారికి జంటగా 1959 లో వచ్చిన ‘దైవబలం’ లో జయశ్రీ నటించగా, ఆవిడ కూతురు జయచిత్ర 1976 లో వచ్చిన ‘మా దైవం’ లో ఎన్.టీ.ఆర్ గారి సరసన హీరోయిన్ గా నటించారు. ఇలా 17 సంవత్సరాలలో తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఒకే హీరో, ఎన్.టీ.ఆర్ గారికి జంటగా నటించడం విశేషం.