ప్రతి ఒక్కరూ ‘గీత గోవిందం’లో ఏదో పాయింట్‌కు బాగా కనెక్ట్‌ అవుతారు – ద‌ర్శ‌కుడు ప‌రుశురాం

0
129

విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ 2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో బన్నివాసు నిర్మించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌రుశురాం మీడియాతో  మాట్లాడుతూ ….

* ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా తర్వాత ‘గీత గోవిందం’ చేయడానికి రెండేళ్లు పట్టింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సమయంలోనే ఈ స్టోరి లైన్‌ను అరవింద్‌గారికి చెప్పాను. ఆయన సినిమా చేద్దామని అన్నారు. సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ మెయిన్‌. కొత్త హీరోయిన్‌ కావాలి. అలాగే నేను కోరుకున్న ఎమోషన్‌ని క్యారీ చేయాలి.. కాబట్టి హీరోయిన్‌ని వెతకడంలో ఎనిమిది నెలల సమయం పట్టింది. చివరకు రష్మిక ఎంపిక చేసుకున్నాం.

* నిజానికి అర్జున్‌ రెడ్డి సినిమా విడుదల కంటే ముందుగానే విజయ్‌ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాం. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే అర్జున్‌ రెడ్డి విడుదలై పెద్ద సక్సెస్‌ అయింది. అర్జున్ రెడ్డి సినిమాలోని పాత్రను బట్టి విజయ్ అలా అగ్రీసివ్ గా నటించాడు. మా సినిమాలోని పాత్రకు అనుగుణంగా నటించాడు.

* రెండు వేర్వేరు మనస్తత్వాలుండే హీరో గోవిందం, హీరోయిన్‌ గీత ఎలా ప్రేమలో పడ్డారు. ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేశారు. సమస్యలను ఎలా అధిగమించారనేదే కథ. సినిమా చూసే ప్రతి ఒక్కరూ సినిమాలో ఏదో పాయింట్‌కు బాగా కనెక్ట్‌ అవుతారు.

* సాంగ్స్ హిట్ చేసేద్దామని అనుకుంటే హిట్ అవ్వ. ప్రతి సాంగ్ కు ఓ సందర్భం ఉండాలి. మా సినిమాలో సాంగ్స్ అన్ని మోంటేజ్ సే. ప్రతి సాంగ్ లో కథ నడుస్తోంది. అదికాక మేం సాంగ్స్ కోసం చాలా వర్క్ చేసాము. మా మ్యూజిక్ డైరెక్టర్ గోపి కూడా బాగా కోపరేట్ చేసాడు.

* నా సినిమాలకు వస్తున్న ఆదరణకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను సినిమాలు చేసే హీరోలు, నిర్మాతలు నా వర్కింగ్‌ స్టయిల్‌తో హ్యాపీగా ఉన్నారు. ఓ దర్శకుడిగా ఇంత కంటే ఏం కావాలి.

* నా తదుపరి చిత్రం గీతాఆర్ట్స్‌లోనే ఉంటుంది. అరవింద్‌గారికి లైన్‌ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఇది కాకుండా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తాను. నా స్ట్రెంత్ ఎమోషన్ అండ్ కామెడీ. నేను ఏ సినిమా చేసినా ఈ రెండు ఎప్పటికి మిస్ కాకుండా చూసుకుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here