డియర్ కామ్రేడ్ షూటింగ్ ప్రారంభం

0
424

యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా “కామ్రేడ్” రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. “ఫైట్ ఫర్ వాట్ యు లవ్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. ఆంధ్రా స్లాంగ్ లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. సోషల్ రెస్పాన్సబిలిటీ ఉన్న ఇంటెన్స్ రోల్ ను విజయ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తారాగణం:
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న తదితరులు..

సాంకేతిక వర్గం:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్-బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని-రవి శంకర్ యలమంచిలి-మోహన్ చెరుకూరి (CVM)-యష్ రంగినేని
సహ-నిర్మాత: ప్రవీణ్ మార్పురి
సి.ఈ.ఓ: చెర్రీ
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
డి.ఓ.పి: సుజిత్ సారంగ్
ఎడిటర్-డి.ఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్
మాటలు: జై కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
లిరిక్స్: కృష్ణకాంత్, చైతన్య ప్రసాద్, వనమాలి, రెహమాన్
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ బైరి-శ్రావ్యవర్మ
యాక్షన్ డైరెక్టర్: జి.మురళి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here