‘బాహుబ‌లి’ నా లైఫ్‌లో మెమ‌ర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్ – యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌

0
503

ఆర్కా మీడియా వ‌ర్క్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `బాహుబ‌లి 2`. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా యంగ్ రెబ‌ల్ స్టార్‌ప్ర‌భాస్‌తో ఇంట‌ర్వ్యూ.

‘బాహుబలి’కి సంబందించిన పనులన్నీ అయిపోయాయి కదా.. మీకెలా అనిపిస్తోంది ?
– నేనింకా బాహుబలి ఫీవర్ నుండి బయటకు రాలేదు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్ది టెంక్షన్ ఇంకా పెరుగుతోంది. ఒకసారి సినిమా రిలీజై మా పనిని ఆడియన్స్ మెచ్చుకుంటే తప్ప రిలాక్స్ అనేది ఉండదు.

’బాహుబలి’ ప్రాజెక్ట్ తో మీ ఐదేళ్ల ప్రయాణాన్ని ఎలా డిఫైన్ చేస్తారు ?
– నా అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. రాజమౌళి డ్రీమ్ ను ఫాలో అయిపోయాను. ప్రాజెక్ట్ ఆరంభంలో ప్రతిదీ ఒక ప్రయోగంలానే ఉండేది. మొదటి భాగానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. ఒకసారి వివి. వినాయక్ గారు మాట్లాడుతూ ఇన్ని ప్రశ్నలతో ఉన్న సినిమా ఎలా హిట్టైంది అన్నారు. అప్పుర్థమయింది ప్రేక్షకులు మా విజన్ ను ఎంకరేజ్ చేశారని. ఆ తర్వాత మాలో కూడా భాద్యత ఎక్కువైంది. కొంచెం నమ్మకం పెరిగింది. కానీ ఇన్ని భారీ అంచనాలను క్యారీ చేయడం ఎలా అనే చిన్న టెంక్షన్ కూడా పట్టుకుంది.

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఇంత పెద్ద హిట్టవుతుందని మీరనుకున్నారా ?
– ఈ ప్రశ్న ఇంత పెద్ద హిట్టవుతుందని అస్సలు అనుకోలేదు. కేవలం ఇది సినిమా ముగింపుకు ఒక మంచి బ్యాంగ్ మాత్రమే అవుతుందని అనుకున్నాం. కానీ అనుకోకుండా అదే పెద్ద హిట్టై సినిమాకి కావాల్సినంత హైప్ తెచ్చిపెట్టింది.

మీరు నటించిన రెండు పాత్రల్లో మీకు ఎక్కువగా ఏది ఇష్టం ?
– శివుడి పాత్ర చాలా ఈజీగా చేశాను. ఎందుకంటే అందులో ఎలాంటి రూల్స్ ఉండవు. చాలా ఫ్రీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ రాజు పాత్ర అలా కాదు. దానికంతో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారమే నేను నడుచుకోవాలి. ఆ రెండు పాత్ర మధ్య కొంచమే తేడా ఉంటుందని అనుకుంటాం. కానీ నేను మాత్రం ఆ పాత్ర కోసం నాలుగేళ్లు వర్కవుట్స్ చేశాను.

రానాతో కలిసి పనిచేయడం ఎలా ఉంది ?
– రానా పాత్ర సినిమాకి చాలా ముఖ్యమైంది. అలాంటి నెగెటివ్ రోల్ చేయడానికి ఘట్స్ ఉండాలి. అతన్ని సెకండ్ పార్ట్ లో చూపించిన విధానం భయంకరంగా ఉంటూనే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అతను చాలా గొప్పగా చేశాడు. అతనితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

చిత్రీకరణ సమయంలో ఎలా ఉండేది ?
– ప్రతిరోజూ ఒక కొత్త అనుభవమే. వేల మంది టెక్నీషియన్స్, ఎక్కడా తప్పు జరగడానికి ఆస్కారం లేదు. ఒక్కోసారి ఇంకో టేక్ అడగడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఒక్కసారి ఏదైనా పొరపాటు జరిగి షాట్ సరిగా రాకపోతే మళ్ళీ అంతా సెటప్ చేసుకోవడానికి కొన్ని గంటల సంయమ పడుతుంది.

ఈ సినిమా ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అవుతుందని ఎప్పడనిపించింది ?
– రాజమౌళి నాకు వాటర్ ఫాల్ సీన్ ను వివరిస్తూ ప్రవాహం మేఘాల్లోంచి వస్తుంది అని చెప్పగానే అప్పుడారథమయింది రాజమౌళి విజన్ ఏమిటి అని. అప్పుడే అనుకున్న ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ అవుతుందని. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అన్ని హాలీవుడ్ సినిమాల్లో కన్నా ఈ సినిమాలోనే వాటర్ ఫాల్ సీన్ గొప్పగా ఉంటుంది.

హాలీవుడ్ సినిమాల్లో చేయ‌బోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా
– ఈ సినిమా స‌క్సెస్‌తో పాటు మంచి విష‌యాలు, రూమ‌ర్స్ అన్నీ ఎడా పెడా వాయించేస్తున్నాయి. హాలీవుడ్‌లో నేను చేస్తాన‌న‌డం రూమ‌ర్‌.

బాలీవుడ్‌లో క‌ర‌ణ్‌జోహార్ సినిమా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి?
– అలాంటిదేమీ లేదు. అన్నీ రూమ‌ర్స్‌

మీ నెక్ట్స మూవీ షూటింగ్ కంటే ముందు టీజ‌ర్ రానుంద‌ట అవునా?
– నా నెక్ట్స్ సినిమాకు సంబంధించి చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి క్లారిటీ రావాలి. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది.

రాజ‌మౌళి మ‌హాభార‌తంలో చేస్తే మీరే క్యారెక్ట‌ర్ చేస్తారు?
– రాజ‌మౌళిగారికి మ‌హాభార‌తం చేయాల‌నుంది కానీ, బాహుబ‌లి త‌ర్వాత మ‌హాభార‌తం చేయ‌మంటే, రాజ‌మౌళిగారు కొట్టినా కొట్టే అవ‌కాశం ఉంది. రాజమౌళిగారు మ‌హాభారతం ఏ క్యారెక్ట‌ర్ ఇచ్చినా చేయ‌డానికి నేను సిద్ధం.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఎప్పుడు ఉంటుంది?
– సుజిత్ సినిమాతో పాటు చేయాల‌నే ఆలోచ‌న ఉంది. బాహుబ‌లి 2 త‌ర్వాత దానికి సంబంధించి కూడా ఆలోచిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here