ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు , ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి

1
215

ఢిల్లీ: 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు నిలిచింది. ఇదే సినిమాకు సంభాషణలు అందించిన తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణల అవార్డు దక్కడం విశేషం. ఇక జనతా గ్యారేజ్ సినిమాకుగాను కొరియాగ్రఫీ చేసిన రాజు సుందరానికి ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. ఉత్తమ హిందీ చిత్రం అవార్డును సోనమ్ కపూర్ నటించిన నీర్జా దక్కించుకుంది. ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు రుస్తుం సినిమాలో నటనకుగాను అక్షయ్ కుమార్ కు దక్కింది. ఉత్తమ నటిగా మలయాళ చిత్రం మిన్నమినుంగు హీరోయిన్ సురభి నిలిచింది. ఉత్తమ సామాజిక చిత్రం అవార్డు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన పింక్ కు దక్కింది. ఇక సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం అవార్డును ఉత్తరప్రదేశ్ కు ఇచ్చారు జ్యూరీ సభ్యులు.

ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)

ఉత్తమ నటి – సురభి (మిన్నమినుంగు, మలయాళం)

ఉత్తమ సహాయ నటి – జాయిరా వాసిం (దంగల్, హిందీ)

ఉత్తమ చిత్రం – కాసవ్ (మరాఠీ)

ఉత్తమ దర్శకుడు – రాజేష్ మపుస్కర్ (వెంటిలేటర్, మరాఠీ)

ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌
ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్‌
ఉత్తమ తమిళ చిత్రం – జోకర్‌
ఉత్తమ మలయాళ చిత్రం – మహేషింటే ప్రతీకారం

ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి
ఉత్తమ బాలల చిత్రం – ధనక్‌
ఉత్తమ ఛాయాగ్రహణం – తిరు (24 , తమిళ్)

ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ – పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)
ఉత్తమ నృత్యదర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)
ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణ – తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ – శివాయ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here